ఒక ఓటు కూడా బీజేపీకి వేయొద్దు.. సీఎం కేసీఆర్

0
683

బీజేపీకి ఒక్క ఓటు కూడా వేయవద్దన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఢిల్లీ బ్రోకర్ గాళ్లు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొందామనుకున్నారు. రూ.100 కోట్లు ఇస్తామన్నా ఆత్మగౌరవాన్ని కాపాడారు. ఎడమకాలి చెప్పుతో కొట్టినట్లు వారికి బుద్ది చెప్పారు. ఇంత అరాచకం జరుగుతుంటే మౌనం పాటిద్దామా?రాజకీయం అంటే అమ్ముడుపోవడం కాదని మా ఎమ్మెల్యేలు నిరూపించారు. ఆర్‌ఎస్‌ఎస్ ముసుగులో వచ్చి చంచల్‌గూడ జైల్ లో ఉన్నారు. వందల కోట్లు ఎక్కడినుంచి వచ్చాయో విచారణలో తేలాలి. దీని వెనక ఉన్నవాళ్లు ఒక్క క్షణం కూడా పదవుల్లో ఉండేందుకు వీళ్లేదు. మోడీ రెండు సార్లు పీఎం అయ్యావు.. నీకేం కావాలి.

మనం చైతన్యం కావాలి. దోపిడీ దారులు మాయమాటలు చెబుతారు. వారి మాటలు నమ్మవద్దు. నిన్న మొన్న ఢిల్లీ బ్రోకర్ గాళ్ళు వంద కోట్లు ఇస్తామంటే ఎడమకాలి చెప్పుతో కొట్టారు. తెలంగాణ ఆత్మగౌరవ బావుటాను ఎగరేశారు. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, హర్షవర్థన్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు… ఇలాంటి వాళ్ళు కావాలి. 100 కోట్లు ఇస్తామంటే వద్దన్నారు. గడ్డిపోచలా వాటిని పడేశారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడారు. అక్రమ ధనం తెచ్చి.. పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యుల్ని సంతలో పశువుల్లా కొని ప్రభుత్వాలను కూల్చాలని చూస్తున్నారు. ఒళ్లు మరిచిపోయి ఓటు వేస్తే… ఇళ్ళు కాలిపోతాది. దేశంలో ఏమి జరుగుతున్నది ? కరిచే పాము అని తెలిసి మెడలో వేసుకుంటామా ?

కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి రావాలంటే చేనేత కార్మికుల కుటుంబాల నుంచి ఒక ఓటు కూడా బీజేపీకి ఓటు వేయొద్దు.. పాము కరుస్తుందని తెలిసి.. ఆ పాముకి ఓటు వేద్దామా? చేనేతలు బీజేపీకి బుద్ధి చెప్పాలి.బిజెపికి తెలంగాణలో బుద్ధి చెప్పాలి . ఇండియా ఆకలి రాజ్యంగా మారుతుందా? డాలరుతో రూపాయి విలువ 82 రూపాయలా. అర్థం అయిన తర్వాత కూడా బుద్ధి చెప్పాలి. మీ ఓటే మీ ఆయుధం. నాటకాలు నడవవు. లక్షల కోట్లు పేదలకు చెందినది పెద్దలకు ఇస్తారా? ప్రభుత్వరంగంలోని కంపెనీలను కాపాడదామా? వడ్డు కొనుడు చేతకాదు.. 100 కోట్లు ఇచ్చి ఎమ్మెల్యేలను కొంటారా? బీజేపీకి బుద్ధి చెప్పాలి… ఓటు ద్వారా మనం తిరుగుబాటు చేయాలి. మీ ఆటలు సాగవని మనం సందేశం ఇవ్వాలి. వామపక్షాలు, మేము చేయగలిగింది ఏమీ లేదు. ఇంటింటికి వచ్చి చెబుతున్నాం. అన్యాయం జరిగింది.. పెట్రోల్ ధర పెరిగింది.. జీఎస్టీమీద పోరాడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here