విశాఖ రాజధానిపై ఇవాళ క్లారిటీ..!

0
26

ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.. జులై నుంచి విశాఖకు వెళ్తున్నామని మంత్రులకు చెప్పారు సీఎం జగన్.. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా ఆమోదించాల్సిన బిల్లుల కోసం కేబినెట్ భేటీ ఏర్పాటు చేశారు. అధికారికంగా కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత మంత్రులతో మాట్లాడిన సీఎం.. విశాఖ నుంచి పరిపాలన గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారట.. ఉగాది నుంచి సీఎం జగన్ .. విశాఖకు వెళ్తారని అక్కడి నుంచే పరిపాలన చేస్తారని కొంత కాలంగా ప్రచారం సాగుతూ వచ్చింది.. అయితే దీనిపై సీఎం జగన్‌ స్పందిస్తూ.. ఇప్పుడే కాదని స్పష్టంచేశారట.. జులైలో విశాఖ వెళ్తామని పేర్కొన్నట్టుగా తెలుస్తోంది.

మొత్తంగా విశాఖ నుంచి పాలనపై ఫోకస్‌ పెట్టారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. వచ్చే విద్యాసంవత్సరం విశాఖ నుంచి పాలన ప్రారంభించాలన ప్లాన్‌లో ఉన్నారు.. జులై నుంచి విశాఖ నుంచి పాలన చేయనున్నట్లు నిన్న మంత్రులతో స్పష్టం చేసిన సీఎం జగన్‌.. ఇవాళ అసెంబ్లీ వేదికగా స్పష్టత ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సమాధానం ఇవ్వనున్నారు ముఖ్యమంత్రి జగన్.. తన సమాధానంలో భాగంగా విశాఖ నుంచి పాలన అంశాన్ని ప్రస్తావించే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, బడ్జెట్‌ సమావేశాలు మంగళవారం ప్రారంభం కాగా.. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు.. గత నాలుగేళ్లలో ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, రాష్ట్ర అభివృద్ధి, చేపట్టిన ప్రాజెక్టులు తదితర అంశాలు ప్రస్తావించారు. ఇక, ఇవాళ గవర్నర్‌ ప్రసంగాన్ని ధన్యవాద తీర్మానంపై చర్చ తర్వాత సీఎం వైఎస్‌ జగన్‌ సమాధానం ఇవ్వనున్నారు. అసెంబ్లీలో గురువారం రోజు ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న విషయం విదితమే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here