21 నుంచి విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ

0
748

విద్యార్థులకు మరో శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. విద్యార్థులను డిజిటల్‌ దిశగా నడిపించడంతోపాటు కరోనా వంటి విపత్కర పరిస్థితులు తలెత్తినప్పుడు అభ్యసనాన్ని కొనసాగించేందుకు వీలుగా జగన్‌ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతోన్న విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేయాలని నిర్ణయించిన విషయం విదితమే కాగా.. ఈ నెల 21న ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు.. 21వ తేదీన బాపట్ల జిల్లాలో ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఇప్పటికే బైజూస్‌తో ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న విషయం విదితమే కాగా.. విద్యార్థులకు పంపిణీ చేసే ట్యాబ్‌లలోనే బైజూస్ కంటెంట్ అప్ లోడ్ చేసి ఇవ్వనున్నారు.

మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల 18 ట్యాబ్‌లను పంపిణీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది వైఎస్ జగన్‌ సర్కార్.. ఈ నెల 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు మండల కేంద్రాల్లో విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నారు.. మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేల నేతృత్వంలో ఈ కార్యక్రమం జరగనుంది.. రాష్ట్ర వ్యాప్తంగా 676 మండలాల్లో ట్యాబ్‌ల పంపిణీ కేంద్రాల ద్వారా ఈ పంపిణీ జరగనుంది.. జిల్లాల్లో కలెక్టర్లు, స్థానిక ఎమ్మెల్యేల సహకారంతో తగిన ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లాయి.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. ఈ కార్యక్రమానికి ఈ నెల 21న సీఎం జగన్‌ శ్రీకారం చుట్టనుండగా.. మరుసటి రోజు అంటే.. 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు విద్యార్థులకు ట్యాబల్‌ పంపిణీ జరగనుంది. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు జగన్ సర్కార్ శ్రీకారం చుడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ దిశగా పలుకీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా విద్యా విధానాలు బాగుంటేనే భవిష్యత్ తరాలు బాగుంటాయని సీఎం జగన్ ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. ఈ విషయాన్నే పలు సందర్భాల్లో వెల్లడించారు సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here