బాలాపూర్‌లో హీరోయిన్ కీర్తి సురేష్ సందడి.. సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభం

0
102

తెలంగాణలో ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ సీఎంఆర్ ఫ్యామిలీ మాల్ తమ మరో ప్రతిష్టాత్మకమైన షాపింగ్‌ మాల్‌ను అక్టోబర్ 1న బాలాపూర్‌‌లో ప్రారంభించింది. మహానటి కీర్తి సురేష్, తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి చేతుల మీదుగా ఈ మాల్ అంగరంగవైభవంగా ప్రారంభోత్సవం జరుపుకుంది. ఇక నుంచి బాలాపూర్‌‌, చుట్టు ప్రక్కల ప్రాంతాల వారు హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్‌లో గంటల తరబడి ప్రయాణాలు చేసి సిటీకి వెళ్లి షాపింగ్‌ చేయవలసిన అవసరం లేకుండా 5 అంతస్థులు, 25,000 చదరపు అడుగులలో కుటుంబమంతటకీ షాపింగ్ ఒకోచోట చేసుకునే విధంగా దీనిని ఏర్పాటు చేశారు. పట్టు, ఫ్యాన్సీ, హై ఫ్యాన్సీ, చుడీదార్స్, వెస్ట్రన్‌వేర్, బెడ్ షీట్స్, మెన్స్ బ్రాండెడ్, కిడ్స్ వేర్, ఎథినిక్ వేర్‌‌లతో సహా ఒక్కో విభానికి ఒక్కో అంతస్థు కేటాయిస్తూ ప్రతిష్టాత్మకంగా అంతర్జాతీయ షాపింగ్ అనుభూతిని ఇస్తూ.. మార్కెట్ ధరల కన్నా తగ్గింపు ధరలకు విక్రయిస్తున్నామని.. ఈ షాపింగ్ మాల్ ద్వారా మరో 300 మందికి ఉపాధి కల్పిస్తున్నామని సీఎంఆర్ సంస్థ అధినేత అల్లక సత్యనారాయణ తెలిపారు. ఈ ప్రారంభోత్సవ వేడుకను ఇంతటి ఘన విజయం చేకూర్చినందుకు కస్టమర్లకు, పోలీస్ శాఖ వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here