చిత్తూరు జిల్లాలో ఉపముఖ్యమంత్రిని నిలదీసిన కానిస్టేబుల్ పై సస్పెన్షన్ వేటు పడింది.. అంతే కాదు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని కార్వేటినగరం మండలం గుండ్రాజుపల్లిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నాడు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.. అయితే, గ్రామంలోకి వచ్చిన నారాయణ స్వామిని రోడ్డు కోసం నిలదీశాడు కానిస్టేబుల్ యుగంధర్.. అయితే, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, కానిస్టేబుల్ యుగంధర్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.. దీంతో, కానిస్టేబుల్ ను అడ్డుకున్నారు నారాయణస్వామి అనుచరులు.. కానీ, ఉపముఖ్యమంత్రితో దురుసుగా ప్రవర్తించారన్న కారణంగా కానిస్టేబుల్ యుగంధర్ పై సస్పెన్షన్ వేటు పడింది.. ఇక, ఐపిసి 153, 505 సెక్షన్ల కింద కేసు కూడా నమోదు చేశారు.