RRR టీంకి సీపీఐ నేత రామకృష్ణ అభినందనలు తెలిపారు. ఇది తెలుగువారికి గర్వకారణం అని ప్రశంసించారు. ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ పురస్కారం లభించడం అభినందనీయం.బెస్ట్ ఒరిజినల్ సాంగ్ మోషన్ పిక్చర్ కేటగిరీలో అవార్డు సాధించటం హర్షణీయం.ఈ అవార్డుతో తెలుగు చలనచిత్ర ఖ్యాతి అంతర్జాతీయ స్థాయికెక్కింది.ఇది తెలుగు వారికి గర్వకారణం.దర్శకులు రాజమౌళి, సంగీత దర్శకులు కీరవాణి, రచయిత చంద్రబోస్, గాయకులు రాహుల్ సిప్లిగంజ్, నృత్య దర్శకులు, చిత్ర యూనిట్ కు అభినందనలు తెలిపారు సీపీఐ నేత రామకృష్ణ.
రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో అవార్డులను గెలుచుకున్న ఆర్ఆర్ఆర్ సినిమా తాజాగా గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రధానంలో సత్తా చాటిన సంగతి తెలిసిందే. రెండు కేటగిరీల్లో అవార్డ్ కోసం పోటీ పడింది ఆర్ఆర్ఆర్. బెస్ట్ నాన్ ఇంగ్లీష్ కేటగిరీలో నామినేట్ అయ్యింది. అలాగే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ‘నాటు.. నాటు..’ నామినేట్ అయ్యింది.బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ విన్ అయ్యింది. బెస్ట్ సాంగ్ గా నాటు నాటు సాంగ్ కు అవార్డు లభించిన సంగతి తెలిసిందే.