తొలి వన్డేలో శ్రీలంకపై భారత్ ఘన విజయం

0
824

Ind vs SL : గౌహతిలోని బర్సపరా స్టేడియంలో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో భారత్ 67 పరుగుల తేడాతో విజయం సాధించింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌లో.. బౌలింగ్‌లో ఉమ్రానా మాలిక్ విరుచుకుపడటంతో భారత్ శ్రీలంకను ఓటమిలోకి నెట్టేయగలిగింది. శ్రీలంక కెప్టెన్‌ దసున్ షనక చేసిన పోరాటం వృథా అయింది. దీంతో సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. తొలుత టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక జట్టు.. భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 373 పరుగులు చేసింది. శ్రీలంకకు 374 పరుగుల భారీ లక్ష్యాన్ని అందించింది. శ్రీలంకపై తొలివన్డేలో ఓపెనర్లు రోహిత్ శర్మ (83), శుభ్‌మన్ గిల్ (70) భారత్‌కు శుభారంభం అందించగా, 20వ ఓవర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడి శతక్కొట్టాడు.

ఛేజింగ్‌లో శ్రీలంక బ్యాటర్లు దసున్ షనక(108), పథౌమ్ నిస్సాంక (72), ధనంజయ డి సిల్వా (47) మంచి ప్రతిభ కనబరిచినా ఓటమిని తప్పించుకోలేకపోయారు. శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 306 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్ ఉమ్రాన్ మాలిక్ 57 పరుగులు ఇచ్చి 3 వికెట్లతో శ్రీలంకపై తన బుల్లెట్ల లాంటి బంతులతో విరుచుకుపడ్డాడు. సిరాజ్ రెండు, షమీ, హార్దిక్, చాహల్ తలా వికెట్ సాధించారు.

టీమిండియా బ్యాటర్లలో విరాట్‌ కోహ్లి(113) అద్భుతమైన శతకాన్ని సాధించగా.. రోహిత్‌ శర్మ (83), శుభ్‌మన్‌ గిల్‌ (70) అర్ధసెంచరీలతో రాణించారు. లంక బౌలర్లలో కసున్‌ రజిత 3 వికెట్లు పడగొట్టగా.. మధుశంక, కరుణరత్నే, షనక, ధనంజయ డిసిల్వ తలో వికెట్‌ దక్కించుకున్నారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జనవరి 12న జరగనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here