ముగ్గురు కూతుళ్లు కలిశారు.. తండ్రిని చంపి తగలెట్టేశారు..

0
43

మానత్వం మంట గలిసిపోతోంది.. డబ్బు కోసం, ఆస్తుల కోసమే చూస్తున్నారు తప్ప.. కన్నవారి అని కూడా చూడకుండా కర్కషంగా వ్యవరిస్తున్నారు.. తాజాగా, కామారెడ్డి జిల్లాలో దారుణమైన ఘటన వెలుగు చూసింది.. ఆస్తి ఇవ్వలేదన్న కోపంతో కన్నతండ్రినే హతమార్చారు ఆయన కూతుళ్లు.. ఆ తర్వాత ఇంటికి నిప్పటించి తగలబెట్టారు.. ఈ ఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది.

రాజంపేటలో జరిగిన ఈ దారుణమైన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కొప్పుల ఆంజనేయులు అనే వృద్ధుడిని కన్న కూతుర్లే దారుణంగా కొట్టారు.. అనంతరం ఇంటికి నిప్పుపెట్టి తగలబెట్టారు. దీంతో ఆంజనేయులు ఇంట్లోనే దహనమయ్యాడు. తమకు ఆస్తి ఇవ్వలేదనే కోపంతోనే ముగ్గురు కూతుర్లు కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు చెబుతున్నారు.. పతకం ప్రకారం.. తండ్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయం చూసి.. దాడి చేశారు.. ఆ తర్వాత ఇంటికి నిప్పుపెట్టారు.. అయితే, ఆ ముగ్గురికి ఆంజనేయులు మనవడు సహకరించినట్టుగా చెబుతున్నారు.. ముగ్గురు కూతుర్లు, మనవడు కలిసే ఈ దారుణానికి పాల్పడ్డారిని అనుమానం వ్యక్తం చస్తున్నారు.. అయితే, ఈ మధ్యే ఆంజనేయులు తనకు చెందిన ఎకరం భూమిని విక్రయించాడట.. దీంతో.. ఆయనకు రూ.10 లక్షలు వచ్చాయి.. ఆ డబ్బులు అడిగినా తమకు ఇవ్వలేదన్న కోపంతోనే కుమార్తెలు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.. ఇక, స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న రాజంపేట పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here