దేశరాజధానిలో మరో దారుణ ఘటన.. 12 ఏళ్ల బాలుడిపై సామూహిక అత్యాచారం

0
160

ఢిల్లీలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. దేశరాజధానిలో అబ్బాయిలకు కూడా భద్రత లేకుండా పోయింది. నలుగురు కామాంధులు 12 ఏళ్ల బాలుడిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. దానితో వదలకుండా క్రూరంగా ప్రవర్తించారు. అనంతరం కర్రలతో దారుణంగా కొట్టారు. చావుబతుకుల మధ్య కొట్టాడుతున్న ఆ బాలుడిని అక్కడే వదిలేసి పరారయ్యారు. కొనఊపిరితో ఉన్న బాధితుడిని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఆ బాలుడు ప్రాణాలతో పోరాడుతున్నాడని వైద్యులు వెల్లడించారు.

ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్‌ చీఫ్ స్వాతి మలివాల్‌ తీవ్రంగా స్పందించారు. ఢిల్లీలో అమ్మాయిలకే కాదు.. కనీసం అబ్బాయిలకు కూడా భద్రత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 12 ఏళ్ల బాలుడిపై నలుగురు వ్యక్తులు దారుణంగా లైంగిక దాడికి పాల్పడినట్లు తెలిపారు. అనంతరం కర్రలతో దారుణంగా కొట్టడంతో చావుబతులకు మధ్య ఆసుపత్రిలో ఉన్నాడని తెలిపారు. మహిళా ప్యానెల్ ఈ ఘటనను గుర్తించి పోలీసులతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించిందని ట్వీట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నివేదిక ఇవ్వాలని ఢిల్లీ పోలీసులను కోరినట్లు ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటివరకు ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా ముగ్గురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఢిల్లీ పోలీసులు ఈ ఘటనను తీవ్రంగా పరిగణించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here