ఎన్టీఆర్‌ అసలైన వారసుడు దేవినేని..!

0
184

స్వర్గీయ నందమూరి తారకరామారావు వందో జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.. టీడీపీతో పాటు వైసీపీ నేతలు కూడా ఈ ఉత్సవాలను జరుపుతున్నారు.. ఎన్టీఆర్‌ వారసుడిపై కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన సతీమణి లక్ష్మీపార్వతి.. వైసీపీ నేతల నేతృత్వంలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.. ఎన్టీఆర్ విజ్ఞాన్‌ ట్రస్ట్, దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శత జయంతి సభ నిర్వహించారు.. ముఖ్య అతిథులుగా సినీ డైరెక్టర్ రామ్‌ గోపాల్ వర్మ, పోసాని కృష్ణమురళి హాజరుకాగా.. మాజీ మంత్రి వెల్లంపల్లి, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి, పలువురు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ను కష్టకాలంలో అండగా నిలబడిన దేవినేని నెహ్రూ నిజమైన వారసుడు అని తెలిపారు.. ఇక, ఇంత అద్భుతంగా ఎన్టీఆర్ కార్యక్రమం జరుగుతుందని కలలో కూడా ఊహించలేదన్న ఆమె.. అప్పట్లో నా గొంతు వినిపించకుండా మీడియా అడ్డుకుంది.. జగన్ వల్ల నా గొంతును ఇంత మంది వింటున్నారు.. ఈ శతాబ్ది ఎన్టీఆర్ ది అని పేర్కొన్నారు.

నోటి మాట రాని లోకేష్ కూడా వారసుడిని అంటున్నాడు అంటూ ఎద్దేవా చేశారు లక్ష్మీపార్వతి.. ఎన్టీఆర్ అధికారాన్ని లాక్కున్న వాళ్ళు వారసులు ఎలా అవుతారు? అని ప్రశ్నించిన ఆమె.. సొంత మనుషులే వెన్నుపోటు పొడవటంతో ఎన్టీఆర్ ఎంతో ఆవేదన చెందారు.. మోసం చేసిన చంద్రబాబును అండమాన్ జైలుకు పంపిస్తానని ఎన్టీఆర్ తీర్మానం చేశారు.. చంద్రబాబుకు ఎన్టీఆర్ పేరు పలికే అర్హత లేదు అని ఫైర్‌ అయ్యారు. ఎన్టీఆర్ ఆశయాలను మట్టిలో కలిపేశాడు చంద్రబాబు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ ను కష్టకాలంలో అండగా నిలబడిన దేవినేని నెహ్రూ నిజమైన వారసుడన్న ఆమె.. ఇక, సంబంధం లేకపోయినా గౌరవంతో ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టారు అంటూ సీఎం జగన్‌పై ప్రశంసలు కురిపించారు.. ఒక సామాజిక వివక్ష నుంచి కాపాడి నా గౌరవాన్ని, వ్యక్తిత్వాన్ని నిలబెట్టిన వ్యక్తి వైఎస్‌ జగన్‌ అన్న ఆమె.. ఆర్జీవీ గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here