హైదరాబాద్ బొల్లారం రాష్ట్రపతి నిలయంలో ఉగాది ఉత్సవాల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, హోం మంత్రి మహమూద్ ఆలీ పాల్గొన్నారు. రేపటి నుంచి రాష్ట్ర పతి నిలయం లోకి ప్రజలకు అనుమతించనున్నారు. వర్చువల్ గా ప్రారంభం చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఈ సందర్భంగా రాష్ట్ర పతి ద్రౌపది ముర్మ మాట్లాడారు. కిందటి నెలలో హైదరాబాద్ లోని రాష్ట్ర పతి నిలయం లో బస చేసే అవకాశం దొరికింది.అసమయం లో అక్కడ వున్న ఫ్లోర అండ్ ఫో కోసం తెలుసుకొనే అవకాశం దొరికింది.వాటి అన్నిటిని ప్రజలు తెలుసుకోవాలని అనే ఆలోచన తో ప్రజలకు సందర్శనార్థం రాష్ట్ర పతి నిలయం ప్రారంభించడం జరిగింది..రాష్ట్ర పతి నిలయం చరిత్ర కి సంబందించిన పూర్తి విషయాలు నాలేడ్జ్ గ్యాలరీ లో లభిస్తాయి
రినోవెట్ చేసిన కిచన్ టన్నెల్ ను తెలంగాణ ట్రెడిషనల్ కళ తో నిర్మించాం.గతం లో వున్న రాష్ట్రపతుల చేతుల మీదగా వివిధ గార్డెన్స్ ప్రారంభించడం జరిగింది.ఇప్పుడు నా హయాంలో బుట్టర్ ఫ్లై., రాక్., నక్షత గార్డెన్స్ ., స్టెప్ వెల్స్., ప్రారంభించడం సంతోషంగా ఉంది..ప్రజలు అందరూ రాష్ట్రపతి నిలయం ని సందర్శించండి అని పిలుపునిచ్చారు. గవర్నర్ తమిళి సై మాట్లాడుతూ.. అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అందరూ ఆరోగ్యంగా …సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. గతంలో కేవలం 15రోజులు మాత్రమే ప్రజలకు సందర్శనార్థం అనుమతించగా….ఇప్పుడు 11నెలల పాటు ప్రజలకు అనుమతించనున్న రాష్ట్ర పతి గారికి కృతజ్ఞతలు.కచ్చితంగా రాష్ట్రపతి నిలయం హైదరాబాదులోని ప్రత్యేకమైన టూరిస్ట్ అట్రాక్షన్స్ లో ఒకటిగా నిలుస్తుంది.రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించేందుకు ప్రజలు ఆన్లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు..ఆసక్తి ఉన్నవారు రాష్ట్రపతి నిలయంలో ఉన్న ఫ్లోరల్ కోసం అక్కడ ఉన్న స్కానర్లు స్కాన్ చేసి తెలుసుకోవచ్చు. హైదరాబాదులోని టూరిస్ట్ అట్రాక్షన్స్ లో ప్రత్యేకమైనదిగా రాష్ట్రపతి నిలయం నిలుస్తుందన్నారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. శోభకృతనామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి నిలయాన్ని 11నెలల పాటు ప్రజలకు సందర్శనార్థం ప్రారంభించే నిర్ణయం తీసుకున్నందుకు సంతోషంగా ఉంది.ఉగాది పర్వదినాన ప్రారంభించుకోవడం గొప్ప విషయం. రాష్ట్రపతి నిలయం హెరిటేజ్ బిల్డింగ్.ఢిల్లీ లో ఉండే విధంగా మన హైదరాబాద్ రాష్ట్రపతి నిలయం లో ప్రధాన మంత్రులు, రాష్ట్రపతి నిలయం లో ఇన్ఫర్మేషన్ ఉండడం సంతోషం.హైదరాబాద్ లో అనేక పర్యాటక కేంద్రాలు వున్నాయి.. అందులో ఒకటిగా చేరింది రాష్ట్రపతి నిలయం.రాష్ట్రపతి కార్యకలాపాలు, రాష్ట్ర కార్యకలాపాలు పట్ల అవగాహన కలిగించే విధంగా ఈ రకమైనటువంటి సందర్శనాలు చాలా ఉపయోగపడుతాయి..హైదరాబాద్ కి విజిట్ చేసే వారు కచ్చితంగా రాష్ట్ర పతి నిలయం విజిట్ చేయాలనీ కోరుతున్నా అన్నారు.