కూర మాడిందని భార్యను హత్య చేశాడు.. గుట్టుచప్పుడు కాకుండా పూడ్చేసి..!

0
48

సంసారమన్నాక సవాలక్ష గొడవలుంటాయి. భార్యాభర్తల మధ్య చిన్నచిన్న వాదనలు రావడం సహజమే. కానీ, ఒక్కోసారి ఇలాంటి చిన్న తగువులే తీవ్రమవుతుంటాయి. అనవసర ఘటనలకు దారితీస్తాయి. చిన్న విషయానికి కోపంతో పెద్ద తప్పే చేస్తుంటారు. అలాంటి ఘటనే ఒడిశాలోని సంబల్పూర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. కూర మాడిపోయిందనే కోపంతో ఓ వ్యక్తి భార్యను దారుణంగా కొట్టి హత్య చేశాడు. అనంతరం గుట్టుచప్పుడు కాకుండా భార్య మృతదేహాన్ని ఇంటి వెనకాల ఉన్న ఖాళీ స్థలంలో పూడ్చిపెట్టాడు. ఆపై తన భార్య నెల రోజులుగా కనిపించడం లేదని నమ్మబలికాడు. పోలీసులు తమదైన శైలీలో విచారించగా విషయం బయటికొచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలి మృతుదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఒడిశా సంబల్పూర్‌ జిల్లాలోని బద్మాల్‌ పంచాయతీలోని రౌత్‌పారా గ్రామానికి రంజన్‌ సింగ్ నెల రోజుల క్రితం వేటాడి ఓ తాబేలు ఇంటికి తీసుకొచ్చాడు. మంచిగా వండమని భార్య సావిత్రికి చెప్పాడు. ఆమె వంట చేయగా.. కూర కాస్త మాడింది. మద్య మత్తులో ఉన్న నిందితుడు రంజన్‌సింగ్‌ భార్యతో గొడవకు దిగాడు. ఆమెను తీవ్రంగా కొట్టడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. అది గమనించకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. రాత్రి తిరిగి ఇంటికి వచ్చేసరికి ఆమె ప్రాణాలు కోల్పోయింది. దీంతో గుట్టుచప్పుడు ఇంటి వెనకాల పూడ్చిపెట్టాడు. చుట్టుపక్కల వారు అడగగా.. తనపై కోపంతో ఇంట్లోంచి వెళ్లిపోయిందని అందరిని నమ్మించాడు. మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంజన్‌సింగ్‌ తమదైన శైలిలో విచారించారు. దీంతో విషయం వెలుగులోకి రావడంతో అతని మీదు కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్‌ చేసి మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here