ప్రఖ్యాత పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఇంటర్నెట్లో చాలా చురుగ్గా ఉంటారు. ఎప్పుడు ఎలాంటి కొత్త వీడియో కనిపించినా షేర్ చేస్తుంటారు. ఈ సారి కర్నాటకలోని ఓ గుడి నుంచి వచ్చిన ఏనుగు వీడియోను షేర్ చేశాడు. కర్ణాటక కత్తిల్ ఏరియాలోని శ్రీ దుర్గా పరమేశ్వరి ఆలయంలో ఓ చిన్నారి నృత్య ప్రదర్శన నిర్వహించింది. అక్కడున్న ఓ ఏనుగు చిన్నారి డ్యాన్స్ కు ఫిదా అయింది. తనతో పాటు చిందేస్తూ తదేకంగా చిన్నారినే అనుకరించింది. ఆ పాప నృత్యం చేస్తూ ఉండగానే.. ఏనుగు ఆమెను ఆశీర్వదించింది. తన తొండెంతో పలుమార్లు చిన్నారి డాన్స్ చేస్తుండగా తల ఊపుతూ చేసిన డ్యాన్స్ పలువురిని ఆకర్షిస్తోంది. ఈ వీడియోను ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో ఆ గజరాజు మనందరికీ ఆశీర్వాదం ఇస్తున్నట్లు తాను భావిస్తున్నానని మహీంద్రా తన ట్వీట్లో పేర్కొన్నారు.
Sri Durgaaparameshwari temple , Kateel, Karnataka.
Amazing. And I would like to think the Temple Elephant is bestowing a blessing on all of us for a Happier New Year! 😊 pic.twitter.com/s2xdqV8w5D— anand mahindra (@anandmahindra) December 31, 2022