ఇండియాలో మంకీపాక్స్ కల్లోలం.. నాలుగుకు చేరిన కేసుల సంఖ్య

0
228

ఇన్నాళ్లు కరోనాతోనే ఇబ్బందులు పడుతున్న జనాలను మంకీపాక్స్ వణికిస్తోంది. శనివారం నాటికి దేశంలో మూడు మంకీపాక్స్ కేసులు వెలుగులోకి రాగా.. తాజాగా ఢిల్లీలో మరో మంకీపాక్స్ కేసు నమోదు అయింది. అయితే కేరళలో నమోదైన మూడు కేసుల్లో బాధితులు ఇటీవల గల్ఫ్ దేశాల నుంచి రాగా.. ఢిల్లీలో నమోదైన నాలుగో కేసులో మంకీపాక్స్ బాధితుడికి ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదు. అయితే ఇది ఎలా సోకిందనేది అంతుపట్టడం లేదు. ప్రస్తుతం ప్రస్తుతం 31 ఏళ్ల బాధితుడు మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీలో చేరినట్లు మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది. బాధితుడు జ్వరం, చర్మంపై దద్దుర్లతో ఆస్పత్రిలో చేరాడు.

దేశంలో తొలిసారిగా కేరళలో జూలై 14న తొలి మంకీపాక్స్ కేసు నమోదు అయింది. ఆ తరువాత దుబాయ్ నుంచి కన్నూర్‌కు వచ్చిన 31 ఏళ్ల వ్యక్తికి జులై 18న కేరళ రెండోసారి మంకీపాక్స్ ను గుర్తించారు. జూలై 22న కేరళలో మూడో కేసు బయటపడగా.. జూలై 24న ఢిల్లీలో నాలుగో కేసు వెలుగులోకి వచ్చింది.

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మంకీపాక్స్ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే 75 దేశాల్లో 16 వేల మందికి ఈ వ్యాధి సోకింది. దీంతో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, మంకీపాక్స్ ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా డిక్లేర్ చేసింది. ప్రస్తుతం యూరోపియన్ దేశాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంది. అక్కడే అక్కడే 86 శాతం కేసులు ఉన్నాయి. మరో 11 శాతం కేసులు యూఎస్ఏలో నమోదు అయ్యాయి. బ్రిటన్, ఆస్ట్రేలియా, అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్, బెల్జియం, యూఏఈ, ఇజ్రాయిల్, ఇండియా తదితర దేశాల్లో కేసులు నమోదు అయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here