ఓ వ్యక్తి స్నేహితులతో సరదాగా మందు తాగుదామని కూర్చున్నాడు. అందరూ కలిసి మద్యం సేవించారు. అప్పటివరకు సరదాగా ఉండి మద్యం మత్తులో స్నేహితుడి మలద్వారంలో స్టీల్ గ్లాసును చొప్పించారు. ఈ దారుణ ఘటన ఒడిశాలోని గంజాం జిల్లాలోని బెరంపూర్‌లో జరిగింది. కొద్దిరోజుల వరకు దీని గురించి ఎవరికి చెప్పలేదు. ఆ గ్లాస్ లోపలికి వెళ్లినప్పటి నుంచి అతను మలవిసర్జన చేయలేదు. అనంతరం నొప్పి తీవ్రం కావడం వల్ల ఆస్పత్రికి వెళ్లాడు. గంజాం జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు శస్త్ర చికిత్స చేసి మలద్వారం నుంచి స్టీల్ గ్లాస్‌ను విజయవంతంగా తొలగించారు.
భువనేశ్వర్‌కు నైరుతి దిశలో 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న బుగుడా బ్లాక్ పరిధిలోని బలిపాదర్‌కు చెందిన 45 ఏళ్ల వ్యక్తి.. గుజరాత్‌లోని సూరత్‌కు వెళ్లి అక్కడ పని చేస్తున్నాడు. దాదాపు 10 రోజుల క్రితం అతను తన స్నేహితులతో కలిసి మద్యం సేవించాడు. మద్యం మత్తులో స్నేహితులు అతని మలద్వారంలోకి స్టీల్ గ్లాస్‌ను చొప్పించారు. తర్వాత రోజు నుంచి అతడికి నొప్పి మొదలైంది. కానీ ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. నొప్పి తీవ్రం కావడం వల్ల సూరత్ నుంచి అతడి సొంతూరికి వచ్చాడు. అనంతరం అతడి పొట్టభాగం ఉబ్బడం మొదలైంది. నొప్పి భరించలేని స్థితికి చేరింది. దీనితో ఆస్పత్రికి వెళ్లాడు. ప్రారంభంలో వైద్యులు మలద్వారం ద్వారా గాజును తొలగించడానికి ప్రయత్నించారు. సాధ్యం కాకపోవడంతో శస్త్రచికిత్స చేసి తొలగించారు.
గాజును తొలగించడానికి దాదాపు 2.5 గంటలు పట్టింది. రోగి పరిస్థితి బాగానే ఉందని, మరో నాలుగైదు రోజులు పరిశీలనలో ఉంటారని వైద్యులు తెలిపారు. బాధితుడు ఇప్పుడు కోలుకుంటున్నాడని వైద్యులు తెలిపారు. అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు.