తెలంగాణ మరింతగా అభివృద్ధి చెందాలి

0
809

తెలంగాణ ఎంతగానో అభివృద్ధి చెందుతోందని. ఇంకా ముందుకు సాగాలన్నారు దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి. నిజామాబాద్ లోని ఉత్తర తిరుపతి క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో పాల్గొన్న దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి అనుగ్రహభాషణం చేశారు. గణపతి సచ్చిదానంద స్వామి మాట్లాడుతూ.. దేవుళ్ళను కించపరిచిన నాస్తికుల పై దత్త పీఠాధిపతి హాట్ కామెంట్స్ చేశారు. రాక్షసులు అప్పటి నుంచే ఉన్నారు, వాళ్ళను దైవం చూసుకుంటుంది. అలాంటి మాటలను ఎదురించే వాళ్ళు ఎదురిస్తున్నారు అన్నారు.

ఆరోపణలను అనుభవించే వారు అనుభవిస్తున్నారు. గతంలో కృష్ణుడి వేషంలో రాక్షసులు వచ్చారన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు, ప్రాణం చాలా విలువైంది. కరోనా కొంత ఇబ్బంది పెట్టింది.దగ్గరి వాళ్ళను కోల్పోయాము. రాబోవు కాలంలో అనేక ఇబ్బందులు ఎదురుకావచ్చు.. తట్టుకునే శక్తి ఇవ్వాలని వేడుకుందాం అన్నారు. ప్రకృతి విలయాన్ని మనం ఆపలేం. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది…మరింతగా అభివృద్ధి చెందాలన్నారు దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామిజీ. తెలంగాణ వ్యాప్తంగా అన్ని ఆలయాలు వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా కిటకిటలాడాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here