కూకట్ పల్లిలో గంజాయి విక్రయిస్తూ పట్టుబడ్డ ఐదుగురు

0
977

గంజాయిని విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ముగ్గురు వ్యక్తులను కూకట్‌పల్లి పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నూక దీపక్, సదురాల నరేష్, బీయ మల్లేష్, , అజయ్, సాయి అనే ఐదుగురు వ్యక్తులు కలిసి విశాఖపట్నంలో గుర్తు తెలియని వ్యక్తి దగ్గర 5 కిలోల గంజాయి కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన గంజాయిని రైలులో సికింద్రాబాద్ కి తీసుకొని వచ్చి అక్కడ ఆర్టీసి బస్సులో కూకట్‌పల్లి వరకు తీసుకుని వచ్చారు.

కూకట్‌పల్లి బస్ స్టాప్ లో వీరు అనుమానాస్పదంగా కనిపించటంతో, పోలీసులు వీరిని ప్రశ్నించేందుకు ప్రయత్నించగా వారిలో అజయ్, సాయిలు పరారయ్యారు. మిగితా ముగ్గురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద ఉన్న బ్యాగులో చూడగా అందులో ఐదు కిలోల గంజాయి ఉండటంతో, పోలీసులు వారిని అరెస్టు చేసి వారి పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ నర్సింగ్ రావు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here