గ్రేటర్ హైదరాబాద్ లో వార్డ్ వ్యవస్థకు కూడా ఆటంకాలు ఎదురవుతున్నాయి. రేపటి నుంచి ( జూన్ 02 ) ప్రారంభం కావాల్సిన వార్డ్ ఆఫీసులు, వార్డ్ కమిటీలు వాయిదా పడ్డాయి. వార్డ్ ఆఫీసుల ఏర్పాటు, కమ్యూనిటీ హాల్స్ ను బల్దియాకు ఇచ్చేందుకు ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. 150 వార్డ్ ల్లో ఇప్పటికీ 50కి పైగా వార్డ్ కార్యాలయాల ఏర్పాటులో జాప్యం కొనసాగుతుంది.
Also Read : ఎంపీ అవినాష్‌రెడ్డికి ముందస్తు బెయిల్.. షరతులు ఇవే..
హైదరాబాద్ లోని కమ్యూనిటీ హాల్స్ లలో కార్యాలయాలను ఫిక్స్ చేసిన తర్వాత స్థానికులు అడ్డుకోవడంతో వాటిని అధికారులు మారుస్తున్నారు. తమ కార్యాలయం సైతం అధీనంలో ఉంచుకోవాలని జీహెచ్ఎంసీ పేర్కొంది. దీంతో జూన్ 10న సుపరిపాలన దినోత్సవం రోజు వార్డ్ కార్యాలయాలు ప్రారంభించాలనే యోచనలో ఉన్నతాధికారులు ఉన్నారు.
Also Read : వెడ్డింగ్ కిట్‌లో కండోమ్‌లు, బర్త్ కంట్రోల్ పిల్స్
జూన్ 10లోపు అయిన వార్డ్ ఆఫీసులు రెడీ చెయ్యాలని జోనల్ అధికారులకు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించిన తర్వాత కూడా వార్డ్ కార్యాలయాలు రెడీ చెయ్యకపోవడంతో ఇటీవల కమిషనర్ కు స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్ మెమో జారీ చేశారు. త్వరలోనే వార్డు కార్యాలయాలు ఏర్పాటు చేయాలంటూ పేర్కొన్నారు. లేకపోతే తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.