తన ప్రతిపాదనను తిరస్కరించినందుకు మైనర్ బాలికను 34 సార్లు కత్తితో పొడిచిన గుజరాత్‌కు చెందిన వ్యక్తికి కోర్టు మరణశిక్ష విధించింది. ఇది అరుదైన కేసు అని కోర్టు పేర్కొంది.
తనతో సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి నిరాకరించడంతో ఆ వ్యక్తి బాలికను కత్తితో పొడిచినట్లు తెలిసింది. ఈ సంఘటన 2021లో జరిగింది. నిందితుడు జయేష్ సర్వయ్య (26) దాడి సమయంలో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించిన అమ్మాయి సోదరుడిని కూడా గాయపరిచాడు. అతనిపై ఐపీసీ, పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఆ వ్యక్తి, మైనర్ బాలిక జెట్‌పూర్ తాలూకాలోని జెటల్‌సర్ గ్రామానికి చెందినవారు. జయేష్ సర్వయ్య బాధితురాలిని చాలా కాలంగా వేధిస్తున్నాడు. మార్చి 16, 2021న, నిందితుడు బాధితురాలి ఇంటికి ప్రతిపాదనతో వెళ్లాడు. బాలిక దానిని తిరస్కరించింది. ప్రపోజల్‌ను తిరస్కరించిన బాలిక నిర్ణయంపై ఆగ్రహించిన నిందితుడు బాధితురాలిని కొట్టి, సదరు బాలిక తప్పించుకునేందుకు ప్రయత్నించగా 34 సార్లు కత్తితో పొడిచాడు. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిందితులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. నిందితుడికి మరణశిక్షతోపాటు రూ. 5 వేల జరిమానా కూడా విధించించారు. అప్పీలు చేసుకునేందుకు నిందితుడికి నెల రోజుల సమయం ఇచ్చారు. జయేశ్‌కు మరణశిక్ష పడిన విషయం తెలిసిన బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.