మూడోసారి అధికారం మాదే.. 90 నుండి 100 స్థానాలు మావే

0
55

రాబోయే ఎన్నికలపై మంత్రి హరీష్ రావు జోస్యం చెప్పారు. మూడోసారి అధికారం బీఆర్ఎస్ పార్టీదే అన్నారు హరీష్ రావు. హాట్రిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. 90 నుంచి 100 స్థానాల్లో మేం విజయం సాధిస్తాం. ఈడీలు సిబిఐ లు ఎన్ని విధాల ఇబ్బంది పెట్టిన మాకు ఉన్న బలం మన బీఆర్ఎస్ కార్యకర్తల బలం. బిజెపి మమ్మల్ని ఏమీ చేయలేదు. బీ ఆర్ ఎస్ అంటే బీదలు రైతులు సామాన్యుల పార్టీ. మన పక్కనే ఉన్న కర్ణాటక మహారాష్ట్ర లో ఆసరా పెన్షన్లు లేవు.. కల్యాణ లక్ష్మి లేదు..బీజేపీ కి అదానీ యే దోస్తు. మన రైతు దోస్తు కాడని చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలదా అన్నారు హరీష్ రావు.

అదానీ ఆస్తులు పెంచే నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వానివి… ఆమ్ ఆద్మీ సంపద పెంచే నిర్ణయాలు బీ ఆర్ ఎస్ ప్రభుత్వానివి. ఆదానీ అందానీ పెంచే పార్టీ కావాలా అన్న దాత ఆమ్దానీ పెంచే బీ ఆర్ ఎస్ కావాలా తేల్చుకోవాలి. నెత్తి ,కత్తి లేని వాళ్ళు నత్థి మాటలు మాట్లాడుతున్నారు. ప్రగతి భవన్, సచివాలయాలను కులుస్తామన్న పార్టీలు తెలంగాణ కు అవసరమా? కర్ణాటకలో ఎన్నికలు ఉన్నాయని హిందీ ముస్లింల మధ్యల పగను రెచ్చగొట్టి రాజకీయం చేయాలని ప్రయత్నిస్తుంది బిజెపి పార్టీ అని మండిపడ్డారు హరీష్ రావు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here