మంచిర్యాల జిల్లాలో హరీష్‌రావు పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

0
139

మంచిర్యాల జిల్లాలో నేడు మంత్రి హరీష్‌రావు పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. భీమారంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు మంత్రి హరీష్‌ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భీమారం ప్రజల 30 ఏళ్ల కలను మండలం చేసి సీఎం కేసీఆర్ తీర్చారన్నారు. 5 ఊర్లతో రాష్ట్రంలో ఎక్కడా మండలం ఏర్పాటు కాలేదని, అభయహస్తం, వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామన్నారు. ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చి మహిళల కష్టాలు తీర్చారని ఆయన తెలిపారు. మహిళలకు నీళ్ళు మోసే బాధ పోయిందని, పొయ్యి కాడికి నీళ్ళు వస్తున్నాయన్నారు.

కాంగ్రెస్, బీజేపీ పాలనలో అభివృద్ధి జరగలేదని, కనీసం నీళ్ళు ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా.. కేసీఆర్ కిట్‌, న్యూట్రిషన్ కిట్, అసరా పింఛన్ ఇలా అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. శ్రీరామ నవమి పూర్తి కాగానే గృహ లక్ష్మి తీసుకువస్తున్నట్లు ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్ సూచన మేరకు మహిళల పేరు మీదే 3 లక్షలు ఇవ్వబోతున్నాము. ఆడబిడ్డలు అందరూ సీఎం కేసీఆర్ వైపు ఉన్నరు. దీవిస్తున్నరు. నాడు కరెంట్ ఉంటే వార్త, నేడు కరెంట్ పోతే వార్త. రేవంత్ రెడ్డి ఛత్తీస్ గడ్ సీఎంను తెచ్చి మాట్లాడించారు. అక్కడ యాసంగి వడ్లు కొనరు. మేము గింజ లేకుండా కొంటున్నాము. ఛత్తీస్ గడ్ మోడల్ కాదు కేసీఆర్ మోడల్ కావాలని ప్రజలు అడుగుతున్నారు. ఆబ్ కి బార్ బీఆర్ఎస్ సర్కార్ అంటున్నారు.’ అని హరీష్‌ రావు అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here