తెలుగు రాష్ట్రాల్లో కుమ్మేస్తున్న వడగండ్ల వానతో కడగండ్లు

0
36

రెండురోజుల పాటు వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ అంచనాలు నిజం అయ్యాయి. కడప నగరంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో జనం ఇబ్బంది పడుతున్నారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వెదర్ డిపార్ట్మెంట్ పేర్కొంది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొంకణ్ తీరం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని, బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాల నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు ఈ ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని వెదర్ డిపార్ట్మెంట్ తెలిపింది.

ఈ క్రమంలో ఇవాళ, రేపు కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే గత రెండు రోజుల నుంచి తెలంగాణలో పలుచోట్లు భారీ వర్షాలతో పాటు వడగాళ్ల వాన కూడా పడుతుంది. వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలో వడగాళ్ల వర్షంతో భారీగా ఆస్తి నష్టం కూడా జరిగినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే భారీ వర్షాలతో హైదరాబాద్ నగరం కూడా తడిసి పోయింది. తమిళనాడు నుంచి మధ్య ప్రదేశ్ వరకు గల ద్రోణీ ఇప్పుడు దక్షిణ కర్ణాటక నుంచి జార్ఖండ్ వరకు తెలంగాణ, ఛత్తీస్ గఢ్, ఒడిశా మీదుగా కొనసాగుతుందని వాతావరణ శాఖ పేర్కొంది.

ఇటు ఏపీలోని పలు ప్రాంతాల్లో వాన కురుస్తోంది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో పలుచోట్ల కురిస్తున్న భారీ వర్షం పడింది. రేపు సీఎం జగన్ వస్తున్న సందర్భంగా భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన నాయకులు,కార్యకర్తలు.వర్షంతో ఇబ్బంది పడుతున్నారు. ఉదయం కళరళలాడిన ఫ్లెక్సీలు..ఇప్పుడు వెలవెలబోతున్నాయి. సాయంత్రం సమయంలో గాలి వానకి భారీ ఫ్లెక్సీలు కూలిపోయాయి. గాలికి విరిగిపడ్డాయి. సీఎం సభ వేదిక స్టేజి సంబంధించి ముందు భాగం డెకరేషన్తో ఉన్న పోల్స్ గాలికి పడినవి _తిరువూరులో రేపు జరగనున్నాయి. జగనన్న విద్యా దీవెన కార్యక్రమ సభ ప్రాంగణం ఏర్పాట్లను పరిశీలించారు విజయవాడ సిపి కాంతి రానా టాటా, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఎమ్మెల్సీ తలశీల రఘురాం, ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణ నిధి, డీసీపీ మేరీ ప్రశాంతి, ఆర్డీవో వైవీ ప్రసన్న లక్ష్మీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here