కర్ణాటక రాజధాని బెంగళూరులో విచిత్రమైన కేసు నమోదైంది. ఓ మహిళ తన భర్త లిప్‌స్టిక్ రాసుకుని, మహిళలు ధరించే లోదుస్తులు వేసుకుంటాడని ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మహిళలు ధరించే దుస్తు్ల్లో వింతగా ప్రవర్తించడమే కాకుండా అదనపు కట్నం తీసుకురావాలని అత్తమామలతో కలిసి వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. 25 ఏళ్ల మహిళ ఫిర్యాదు మేరకు భర్త, అత్తమామలపై వరకట్న వేధింపుల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితుడికి మూడేళ్ల క్రితం ఆమె మ్యాట్రిమోని ద్వారా పరిచయం అయ్యింది. ఆ సమయంలో తాను ఎంటెక్ పూర్తి చేసి మంచి ఉద్యోగంలో ఉన్నానని చెప్పాడు. తర్వాత వారిద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. ఇద్దరి అభిప్రాయాలు కలవడం వల్ల.. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అనంతరం పెద్దల సమక్షంలో ఇద్దరూ 2020లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి సమయంలో ఆమె కుటుంబం.. 800 గ్రాముల బంగారం, కేజీ వెండి, రూ.5 లక్షలను కట్నంగా ఇచ్చారు
పెళ్లయిన తొలిరాత్రి భర్త అద్దం ముందు నిల్చుని లిప్ స్టిక్ రాసుకున్నాడు. ఆయన ఆడవాళ్ళ లోదుస్తులు ధరించాడు. ఇదేంటని ఆమె ప్రశ్నించగా.. తనకు మగవాళ్లంటే చాలా ఇష్టమని చెప్పాడు. దీంతో ఆమె నిర్ఘాంతపోయింది. కరోనా సమయంలో వీరి వివాహం జరిగినందున.. అదే సమయంలో లాక్‌డౌన్ విధించారు. దీంతో ప్రతిరోజూ తన భర్తతో ప్రతిరోజూ గొడవలు జరిగేవి. ఒకరోజు తన అత్త ఆమెపై బొద్దింక స్ప్రేతో చంపడానికి ప్రయత్నించింది. ఇదిలా ఉండగా అత్తమామలు అదనపు కట్నం కోసం వేధించారు. తమ కుమారుడిని ఆస్పత్రిలో చూపించేందుకు 10 లక్షలు తీసుకురావాలని వేధించారు. దీంతో అత్తింటివారు వెట్టే వేధింపులు భరించలేక ఇంటి నుంచి వెళ్లిపోయి తన బంధువులు ఇంటికి వెళ్లిపోయింది. అక్కడకు వెళ్లినా వారి వేధింపులు తగ్గలేదని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు ఆమెను వేధించిన భర్త, అత్తమామలపై వరకట్న వేధింపులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.