Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో బంగారం సీజ్

0
47

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ పట్టుబడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. అధికారులు ఎంత నిఘా పెట్టినా బంగారం అక్రమ రవాణా కొనసాగుతునే ఉంది. విదేశాల నుంచి వచ్చే వారు అక్రమ పద్దతుల్లో బంగారంను తీసుకుని వస్తున్నారు. రకరకాల పద్ధతుల్లో గోల్డ్ స్మగ్లింగ్‌ చేస్తున్నారు. అయితే, అక్రమంగా బంగారాన్ని తలిస్తున్న వారికి కస్టమ్స్ అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. తాజాగా మరోసారి ఇలాంటి ఘటన శంషాబాద్ ఎయిర్ పోర్టులో చోటు చేసుకుంది.

శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు ఇవాళ (ఆదివారం) అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఇండిగో విమానంలో జెడ్డా నుంచి హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ఇద్దరు ప్యాసింజర్లు వచ్చారు. ఈ క్రమంలో ఎయిర్ పోర్టు కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించగా.. వారి దగ్గర కోటి రూపాయల విలువైన అక్రమ బంగారాన్ని పట్టుకున్నారు.

ప్రయాణికుల దగ్గర ఫోర్ టేబుల్ స్పీకర్స్, ఐరన్ బాక్స్‌లో 1.88 కిలోల అక్రమ బంగారంను గుర్తించి వాటిని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో వారిని ఎయిర్ పోర్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల దగ్గర పట్టుబడ్డ బంగారం విలువ బహిరంగ మార్కెట్ లో 1.11 కోట్ల రూపాయలుగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. బంగారం స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు నిందితులను విచారణ చేస్తున్నారు.

మరోవైపు.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో మరో ముఠా దుబాయ్ నుంచి వచ్చిన వేరు వేరు విమానాల్లో వచ్చిన నలుగురు ప్రయాణికులు అక్రమంగా తరలిస్తున్న బంగారం తీసుకు వస్తుండగా.. దాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. రూ. 77.02 లక్షల విలువ చేసే బంగారాన్ని గోల్డ్ చైన్లు,బిస్కెట్లు, పేస్టు రూపంలో తరలిస్తుండగా పట్టుకున్నారు. నలుగురిని అదుపులోకి తీసుకొని వాటి వివరాలను సేకరిస్తున్నారు. ఈ ఘటనపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here