భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ ఇంట్లో విషాదం నెలకొంది. తన తండ్రి తిలక్ యాదవ్ (74) కన్నుమూశారు. తిలక్ యాదవ్ తండ్రి కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ కారణంతోనే ఆయన ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయినప్పటికీ అతని పరిస్థితి మెరుగుపడకపోవడంతో, ఖపర్ఖేడాలోని మిలన్ చౌక్‌లోని అతని ఇంటికి తీసుకువచ్చారు. అయినా ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ఉమేష్ తండ్రి
బుధవారం సాయంత్రం 6.30 గంటలకు తుది శ్వాస విడిచారు.
ఉమేష్ యాదవ్ తండ్రి తిలక్ యాదవ్‌కు రెజ్లింగ్ అంటే చాలా ఇష్టం. అయితే అతను తన కొడుకు ఉమేష్‌ను పోలీసు లేదా ఆర్మీలో చేర్పించాలనుకున్నాడు. అయితే, ఉమేష్ ముందు రంజీ క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. అందులో నుంచి ఉమేష్‌కు భారత జట్టులో అవకాశం దక్కింది. కాబట్టి, 2010లో ఐపీఎల్‌లో అతని కోసం ఢిల్లీ డేర్‌డెవిల్స్ వేలం వేసింది. నవంబర్ 2011లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో యాదవ్ అరంగేట్రం చేశాడు. విదర్భ తరఫున టెస్టులు ఆడిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు.
తిలక్ యాదవ్ వాస్తవానికి ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లాకు చెందినవాడు. తిలక్‌కి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు(ఉమేష్) ఉన్నారు. బొగ్గు గనిలో ఉద్యోగం రావడంతో నాగ్‌పూర్ సమీపంలోని ఖపర్‌ఖేడీకి వచ్చి జీవనం ప్రారంభించాడు. మొదట్లో ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండేది.
आंतरराष्ट्रीय क्रिकेटपटूला घडवणारे हात गेले, उमेश यादवच्या वडिलांचे नागपुरात निधन#UmeshYadav #TeamIndia https://t.co/6l7jnLQFHC
— ZEE २४ तास (@zee24taasnews) February 23, 2023