IPL 2023 : సంజూ శాంసన్ తొండాట ఆడలేదు.. చూస్కోండి

0
89

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16లో భాగంగా వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో రాజస్థా్న్ రాయల్స్ వర్సస్ ముంబై ఇండియన్స్ లో ఓ ఘటన జరిగింది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఔటైన విధానం మాత్రం వివాదాస్పదమైంది. 3 పరుగులు చేసిన హిట్ మ్యాన్ సందీప్ శర్మ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయి పెవిలియన్ కు వెనుదిరిగాడు.

అయితే రోహిత్ శర్మ ఔట్ కాలేదని.. సంజు శాంసన్ గ్లోవ్స్ తగలడం వల్లే బెయిల్స్ కిందపడ్డాయి అని హిట్ మ్యాన్ అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తు పోస్టులు పెట్టారు. రోహిత్ శర్మకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ నెట్టింట కామెంట్ల వర్షం కురిపించారు.. దీంతో రోహిత్ శర్మ అవుటైన విధానంపై ఐపీఎల్ యాజమాన్యం క్లారిటీ ఇచ్చింది. రోహిత్ అవుట్ కు సంబంధించిన క్లియర్ వీడియోను ఐపీఎల్ ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది. ఈ వీడియోలో స్పష్టంగా బంతికి స్టంప్స్ ను తాకినట్లు కనిపిస్తుంది.

దీంతో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ గ్లోవ్స్, స్టంప్స్ కు మధ్య కూడా చాలా గ్యాప్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇందుకు సంబంధించిన వీడియోను సంజూ శాంసన్ అభిమానులు.. రోహిత్ ఫ్యాన్స్ ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. సంజూ చీట్ చేశాడరన్నారు.. కదా.. ఇప్పుడేం అంటారు అని క్యాప్షన్స్ పెడుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో రోహిత్ శర్మ, సంజూ శాంసన్ అభిమానుల మధ్య ఒకరిపై మరోకరు విమర్శలు చేసుకుంటూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here