వసుధ కంపెనీల్లో కలకలం రేపుతున్న ఐటీ రైడ్స్

0
2302

రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్నాయి ఐటీ సోదాలు. హైదరాబాద్ తో పాటు ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు, నరసాపురం, వైజాగ్, రాజమండ్రిలో కొనసాగుతున్నాయి సోదాలు. వసుధ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయాల పై ఐటీ అధికారులు విస్తృతంగా సోదాలు జరుపుతున్నారు. ఫార్మా కంపెనీకి చెందిన కార్పొరేట్ కార్యాలయాలు, చైర్మన్ ఇళ్ళు, డైరెక్టర్ల ఇళ్ళల్లో అధికారులు తనిఖీలు చేస్తుండడంతో ఉత్కంఠ నెలకొంది. హైదరాబాద్ వెంగళరావు నగర్ లో రెండు టీమ్ లు, మాదాపూర్ లోని మరో కార్పొరేట్ కార్యాలయంలో నాలుగు టీమ్ లు సోదాలు జరుపుతున్నాయి.

ఫార్మా కంపెనీ నుండి వచ్చిన లాభాలను రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టారు వెంకట రామరాజు. గతంలో పలు రియల్ ఎస్టేట్ కార్యాలయాలపై జరిపిన దాడుల్లో పలు పెట్టుబడులకు సంబంధించిన ఆధారాలు అధికారులకు లభించాయి. వాటి ఆధారంగా సోదాలు చేస్తున్నారు ఐటీ అధికారులు. వసుధ ఫార్మా కెమ్ లిమిటెడ్ (Vasudha Pharma Chem Limited ) లో ఎంవీ రామరాజు ఛైర్మన్ గా వున్నారు. ఎంఎఎస్ రాజు, ఎం ఆనంద్, ఎంవీఎన్ మధుసూదన్ రాజు, ఎంవీఎస్ఎన్వీ ప్రసాద్ రాజు, ఎం.వరలక్ష్మి, కె.వెంకటరాజు, జి.వెంకటరమణ రాజు, డా.పీవీ అప్పాజీ, కొత్తపల్లి శ్రీహరి వర్మ సభ్యులుగా వున్నారు. వసుధ ఫార్మా రాజు 1995 లో సాధారణ స్థాయి నుంచి ఎదిగారు. అద్దె ఇంటి నుంచి ప్రస్థానం మొదలు పెట్టిన రాజు అంచెలంచెలుగా ఎదిగారు. వెంగళరావు నగర్ లో అద్దె ఇంటి నుంచి ప్రస్థానం మొదలుపెట్టారు. వసుధ ఫార్మా టర్నోవర్ 500 నుంచి 1000 కోట్లకు చేరుకుంది. కంపెనీ వ్యవహారాలను పరిశీలిస్తున్నారు ఐటీ అధికారులు.

వసుధ ఫార్మాకు సంబంధించిన 20 కంపెనీలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆంధ్ర తెలంగాణలో 50 చోట్ల ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. వశిష్ట హోమ్స్, వనజ హౌసింగ్ గార్డెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వనజ ఫామ్స్ అండ్ ఎస్టేట్స్, ఏకదంతా ఫామ్స్ అండ్ స్టేట్స్, ఆగ్రో ఫార్మ్స్ గ్రీన్ విల్లా, ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ ,నార్త్ పాయింట్ ఆగ్రో ఫార్మ్స్, శ్రీరాం ప్రైవేట్ లిమిటెడ్, వసుధ ఆర్గానిక్ ప్రైవేట్ లిమిటెడ్, వశిష్ట ఇన్ఫ్రాస్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్, వసుధ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, వేద బయో ఫెయిల్ లిమిటెడ్, వసుధ సాటిలైట్ టౌన్షిప్, విజేత బిల్డర్స్ ,వి ఆర్ ఆర్ ఇన్ఫ్రా కామ్ ప్రైవేట్ లిమిటెడ్, వసుధ కంఫర్ట్ లివింగ్ ప్రైవేట్ లిమిటెడ్. సోదాలు చేస్తున్న ఐటీ. ఎంవి రాజుతోపాటు ఆరుగురు డైరెక్టర్ల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. వసుధ ఫార్మా పేరుతో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నట్లుగా గుర్తించారు. పలు షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి టాక్స్ ఎగ్గొట్టినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here