విమానంలో అర్ధనగ్నంగా మహిళ హల్ చల్.. అరెస్ట్ చేసిన పోలీసులు

0
723

ఎయిర్ విస్తారా ఫ్లైట్‌లో ఇటలీకి చెందిన 45ఏళ్ల మహిళ హంగామా సృష్టించింది. సిబ్బందిపై దాడిచేయడంతో పాటు ఒంటిపై బట్టలు విప్పి అర్థనగ్నంగా నడిచింది. అబుదాబి నుంచి ముంబైకి వస్తున్న విమానంలో జనవరి 30న ఈ ఘటన చోటు చేసుకుంది. క్యాబిన్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు ముంబై పోలీసులు పావులో పెరుసియో అనే మ‌హిళ‌ను అరెస్టు చేశారు. అయితే, ఆ విషయాన్ని ఎయిర్ విస్తారా మంగళవారం ధృవీకరించింది. జనవరి 30న అబుదాబి నుంచి ముంబై వెళ్లే ఎయిర్ విస్తారా విమానం 30వ తేదీ తెల్లవారుజామున 2.03 గంటలకు అబుదాబీలో బయలు దేరింది. 2.30 గంటల సమయంలో ఎకానమీ క్లాస్‌లో కూర్చున్న మహిళ లేచి బిజినెస్ క్లాస్ లో కూర్చుంది. క్యాబిన్లోని ఇద్దరు సభ్యులు వెళ్లి ఆ మహిళతో మాట్లాడారు. తిరిగి తమ సీటుకు తిరిగి వెళ్లాలని కోరారు.

అయితే, ఇటలీకి చెందిన 45ఏళ్ల పావోలా పెరూసియో అనే మహిళ తిరిగి ఆమె సీటుకు వెళ్లకపోగా సిబ్బందిపై దుర్భాషలాడిందని, ఓ సిబ్బందిపై దాడిచేయడంతో పాటు మరో సిబ్బందిపై ఉమ్మి వేసిందని ఎయిర్ విస్తారా ఆ ప్రకటనలో తెలిపింది. కొద్దిసేపటికే మహిళ తన ఒంటిపై బట్టలు విప్పి విమానంలోనే అర్థనగ్న ప్రదర్శన చేసినట్లు ఎయిర్ విస్తారా తన ప్రకటనలో తెలిపింది. గొడవ అనంతరం మహిళలను అదుపులోకి తీసుకున్న సిబ్బంది.. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ కాగానే మహిళను భద్రతా అధికారులకు అప్పగించారు. ఆ తరువాత విమాన సిబ్బంది ఫిర్యాదుతో సహార్ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఆ తరువాత ఆమెకు కోర్టు బెయిల్ మంజూరు చేసినట్లు తెలిసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here