ఈడీ ఎదుట హాజరైన సీఎం.. 9గంటల పాటు 200ప్రశ్నలు

0
61

అక్రమ మైనింగ్ కేసులో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ ఎదుట హాజరయ్యారు. నేడు ఆయనను దాదాపు తొమ్మిది గంటలపాటు అధికారులు విచారించారు. విచారణలో మనీ లాండరింగ్‌ ఆరోపణలపైనా దర్యాప్తు సంస్థ ఆరా తీసినట్లు సమాచారం.. ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ ను దాదాపు 200ప్రశ్నలు అడిగేందుకు ముందుగానే ప్రణాళిక వేసుకుంది ఈడీ. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ ఎదుట సీఎం హాజరుకానుండడంతో జార్ఖండ్ రాజధాని రాంచీ నివురుగప్పిన నిప్పులా మారింది. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. హేమంత్ సోరెన్ నివాసం వద్దకు ఆయన మద్దతుదారులు భారీగా తరలి వచ్చారు. దాంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేశారు. ఇదిలా ఉండగా .. అక్రమ మైనింగ్‌ ఆరోపణల్ని సీఎం హేమంత్‌ సోరెన్‌ కొట్టిపారేశారు. రాష్ట్రంలో అశాంతి సృష్టించేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని హేమంత్ ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు విపక్షాలు కుట్రల పన్నుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం హేమంత్‌ సోరెన్‌ ఇలాంటి ఎత్తుగడలు తమ ముందు పనిచేయవని హెచ్చరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here