సూపర్ సక్సెస్.. 100డేస్.. 101సిటీస్

0
2868

రిలయన్స్ జియో 5జీ నెట్‍వర్క్(Jio 5G Network) ఈ ఏడాది చివరి కల్లా దేశంలోని ప్రతీ పట్టణం, మండలం, గ్రామాల్లో జియో తన ట్రూ 5జీ సేవల్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటి వరకు జియో 5జీ సర్వీసులు (5g Services) దేశంలోని 101 నగరాల్లో అందుబాటులోకి వచ్చాయి. ట్రూ 5జీ సర్వీసులను గతేడాది అక్టోబర్‌లో రిలయన్స్ జియో లాంచ్ చేసింది. 5జీ నెట్‍వర్క్ రోల్అవుట్ మొదలుపెట్టిన 100 రోజుల్లోనే.. 101 నగరాల్లో ఈ కొత్త తరం నెట్‍వర్క్‌ను అందుబాటులోకి తెచ్చింది. తాజాగా తమిళనాడులోని ఆరు నగరాల్లో 5జీని లాంచ్ చేయటంతో ఈ సెంచరీ మార్కును జియో అధిగమించింది.

వరంగల్‌, కరీంనగర్‌ పట్టణాల్లో రిలయన్స్‌ జియో ‘ట్రూ 5జీ’ సేవలను ప్రారంభించింది. ఇప్పటికే హైదరాబాద్‌లో జియో 5జీ సేవలు అందుబాటులో ఉన్నాయి. దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లోని 6 పట్టణాల్లో 5జీ సేవల్ని జియో ప్రారంభించింది.  తాజాగా తమిళనాడులోని కోయంబత్తూర్, మధురై, తిరుచిరాపల్లి, సేలం, హోసూర్, వెల్లూరు నగరాల్లో 5జీ సేవల్ని ప్రారంభించింది. దీంతో దేశంలోని 101 పట్టణాలు, నగరాలు జియో 5జీ సేవల్ని పొందుతున్నాయి. ఈ ఘనతను కేవలం 100 రోజుల్లోనే సాధించి రికార్డ్ నెలకొల్పింది. ఆంధ్రప్రదేశ్ లో కూడా జియో 5జీ సేవలు వినియోగించుకుంటున్నారు. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుమల, తిరుపతి, నెల్లూరు ప్రాంతాల్లో జియో 5జీ వాడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here