తిరుమల పవిత్రతకు, పరిశుభ్రతకు టీటీడీ ప్రాధాన్యత నిస్తోంది. అందులో భాగంగా ఇవాళ్టి నుంచి స్వచ్ఛ తిరుమల-శుద్ద తిరుమల కార్యక్రమం నిర్వహిస్తోంది. అలిపిరి వద్ద జెండా ఊపి స్వచ్చ తిరుమల-శుద్ధ తిరుమల కార్యక్రమాన్ని ప్రారంభించిన మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ. స్వచ్ఛ తిరుమల-శుద్ద తిరుమల కార్యక్రమంలో పాల్గొనడం తన అదృష్టం అన్నారు మాజీ సిజేఐ జస్టిస్ ఎన్వీ రమణ,ఇఓ ధర్మారెడ్డి. తిరుమల కొండల పరిశుభ్రంగా వుంచవలసిన బాధ్యత అందరి పైన వుంది.
తిరుమల కొండలు ప్లాస్టిక్,వ్యర్ద రహిత ప్రాంతంగా వుంచడానికి కార్యక్రమాన్ని ప్రారంభించాం అన్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. మొదటి ఘాట్ రోడ్డు ఏడవ మైలు వద్ద స్వయంగా పాల్గొన్నారు జస్టిస్ ఎన్వీ రమణ. రెండు ఘాట్ రోడ్డులు, రెండు నడకమార్గాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. భక్తులకు ప్లాస్టిక్ వ్యర్దాలను బయట ప్రాంతాలలో వెయ్యకుండా టీటీడీ సహకరించాలన్నారు. తిరుమలను రోజూ లక్షమంది వరకూ భక్తులు దర్శించుకుంటున్నారు. భక్తులు వాడే వివిధ ప్లాస్టిక్ వస్తువుల వల్ల తిరుమలలో స్వచ్ఛత ప్రశ్నార్థకంగా మారుతున్న వేళ ఇటీవల టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల కొండపై ఎవరూ ప్లాస్టిక్ కవర్లు వినియోగించరాదు, షాపుల యజమానులు కవర్లలో పెట్టి వస్తువులు అందించకూడదని ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని, అతిక్రమిస్తే 25 వేల రూపాయలు జరిమానా విధించడం జరుగుతుందని టీటీడీ అధికారులు ప్రకటించారు.తిరుమలకు వచ్చే భక్తులు కూడా ఈ నిబంధన కచ్చితంగా అమలు చేసేలా వారిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.