పాల్‌ అంతే.. సీఎంపై అప్పుడే ప్రశంసలు.. వెంటనే ఫైర్‌.. !

0
768

ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిపై ప్రశంసలు కురిపించారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్.. ఆ తర్వాత కాసేపటికే ఫైర్‌ కూడా అయ్యారు.. రోడ్లపై బహిరంగసభలు, ర్యాలీలు నిర్వహించడంపై నిషేధాన్ని విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.. చంద్రబాబు సభలపై నేను డీజీపీకి ఫిర్యాదు చేసి.. కోర్టుకు వెళ్లాక వైఎస్‌ జగన్ ఇప్పుడు జీవో జారీ చేశారు.. అందుకు సీఎం జగన్‌కు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు. చంద్రబాబు కంటే వైఎస్‌ జగన్ వేయి రెట్లు బెటర్ అంటూ ఆకాశానికి ఎత్తిన పాల్.. నేను చెప్పిన సలహాలు వైఎస్‌ జగన్ కొన్ని పాటించారని తెలిపారు.. ఇక, ఏపీ అభివృద్ధి కోసం జగన్ నన్ను పిలిపించి మాట్లాడతారేమో చూస్తాను.. నా పాస్ పోర్టు పెట్టుకోండి.. లక్ష కోట్ల రూపాయలు తెస్తాను అన్నారు.

బీజేపీని విమర్శిస్తున్నాను.. కానీ, దేశం కోసం ప్రధానికి సహకరిస్తున్నాను అన్నారు పాల్.. ప్రధాని.. కేంద్ర హోం మంత్రి నా సలహాలు తీసుకుంటున్నారన్న ఆయన.. పెద్ద ఎత్తున పెట్టుబడులు కేంద్రానికి వచ్చేలా చేశా.. ప్రధానికంటే జగన్ గొప్పవారా..? అని ప్రశ్నించారు. జగన్ నన్ను పిలిచి నా సలహాలు ఎందుకు తీసుకోరు..? చంద్రబాబుకు ఎలాగూ బుద్ది లేదు.. జగన్‌కే అయ్యింది? అని నిలదీశారు. డియర్ కేఏ పాల్ అని లేఖ రాస్తే చాలు.. పూర్తిగా సహకరిస్తాను అని ప్రకటించారు. మరోవైపు, కందుకూరులో ఎనిమిది.. గుంటూరులో మూడు ప్రాణాలు పోయాయి.. చంద్రబాబు శవాల రాజకీయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కందుకూరులో అంతటి ఘటన జరిగాక కూడా చంద్రబాబు కావలిలో మళ్లీ సభ పెడతారా..? నేను చంద్రబాబు.. టీడీపీ నేతలను శపిస్తున్నాను.. నాశనం అయిపోతారు అని ఫైర్ అయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here