పెద్దిరెడ్డి, మిథున్‌ రెడ్డి వాహన ప్రమాదం.. చంద్రబాబు కుట్రే..!?

0
1212

ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి కాన్వాయ్‌లో ప్రమాదం చోటు చేసుకున్న విషయం విదితమే.. ఈ ఘటనలో తృటిలో తప్పించుకున్నారు పెద్దిరెడ్డి, మిథున్‌రెడ్డి.. అయితే, ఈ ప్రమాదంపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది.. ఈ ఘటనలో సంచలన ఆరోపణలు చేశారు కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ అడపా శేషు.. రోడ్డు ప్రమాదంలో కుట్ర కోణం ఉందని ఆరోపించారు.. చంద్రబాబు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు.. చంద్రబాబు హత్యా రాజకీయాలు చేయడంలో దిట్ట అని పేర్కొన్నర ఆయన.. నిన్న పెద్దిరెడ్డి వాహనానికి జరిగిన రోడ్డు ప్రమాదంపై మాకు అనుమానాలు ఉన్నాయన్నారు.. రోడ్డు ప్రమాదం విషయంలో కుట్రకోణం దాగి ఉంది.. సమగ్రంగా విచారణ చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

ఈ ప్రమాదాన్ని కుట్రగా అనుమానించి కమిటీ వేసి విచారణ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ అడపా శేషు.. కేవలం పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి టార్గెట్‌గా ప్రమాదం జరిగినట్లు అనుమానాలు వ్యక్తం చేశారు.. చంద్రబాబు గతంలో పలువురిని అంతమొందించినట్లు ఆరోపణలు ఉన్నాయన్న ఆయన.. పెద్దిరెడ్డిపై చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చే శారు.. మీకూ అదే పరిస్థితి వస్తుందని చంద్రబాబును హెచ్చరించారు.. మరోవైపు.. చంద్రబాబుకు దమ్ముంటే పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి నియోజకవర్గం పుంగనూరులో పోటీ చేసి గెలవాలంటూ సవాల్‌ విసిరారు కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ అడపా శేషు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here