తాడిపత్రిలో రౌడీ యిజం లేదు.. జేసీ ప్రభాకర్ రెడ్డిపై పెద్దారెడ్డి ఫైర్

0
174

అనంతపురం జిల్లా తాడిపత్రి ప్రాంతంలో నేనే రౌడీ, నేనే రారాజునంటూ 30 సంవత్సరాలు చక్రం తిప్పిన జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం డీజే డాన్స్ చేసుకునే పరిస్థితి వచ్చిందని, విధి రాతనుఎవరు మార్చలేరంటూ తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హాట్ కామెంట్ చేశారు.

తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రజా సంక్షేమ పాదయాత్ర పేరుతో మూడో విడత తాడిపత్రి మండలంలో పాదయాత్ర చేపడుతున్నారు .మూడవరోజు ఇగుడూరు గంగాదేవి పల్లి మీదుగా పాదయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా ఇగుడురులో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాట్లాడుతూ తాడిపత్రి ప్రాంతంలో 30 సంవత్సరాలు పాలేగాళ్ల రాజ్యం ఉండేదన్నారు. జెసి ప్రభాకర్ రెడ్డి నేనే రౌడీ, నేనే రారాజునంటూ చెప్పుకునే పరిస్థితి నుంచి డీజే డాన్సులు వేసుకునే పరిస్థితికి వచ్చారన్నారు. ప్రజలు ఆలోచించాలని విధిరాతను ఎవరూ తప్పించుకోలేరని పేర్కొన్నారు .గతంలో పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టాలంటే జెసి ప్రభాకర్ రెడ్డి అనుమతి తీసుకోవాల్సి వచ్చేదన్నారు.

ప్రజలు మార్పు తీసుకుని వచ్చినందుకే తాడిపత్రి ప్రాంతంలో రౌడీయిజం లేదు, గుండాయిజం లేదు, వ్యవస్థలు లేవన్నారు. బజారునపడి డీజే డాన్సులు చేసే పరిస్థితి వచ్చిందన్నారు. కొడుకు బర్త్డే లో 73 సంవత్సరాలు ఉన్న జెసి ప్రభాకర్ రెడ్డి మహిళా కార్యకర్తలతో కలిసి డీజే డాన్స్ వేయడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనం అన్నారు. టిడిపి నాయకుల ఫంక్షన్లలో జేసీ ప్రభాకర్ రెడ్డి డీజే డాన్స్ వేయమని కోరే సమయం ఆసన్నమైందన్నారు. గత 30 సంవత్సరాలలో గ్రామాలలో వచ్చి ఓటు అడిగిన పాపాన పోలేదన్నారు. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత తాడిపత్రి ప్రాంతంలో సాగునీరు వస్తోందన్నారు కక్షలు కర్పణ్యాలకు దూరంగా ఉండి రైతులు రెండు పంటలు సాగు చేసుకుంటున్నారన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డికి అధికారులన్నా, నాయకులన్న లెక్కలేదని ఆయన నోటికొచ్చినట్లు వారిని తిడుతూ ఉండేవారని ,73 సంవత్సరాలు వచ్చిన ఆయనకు మంచిబుద్ధి, మనసు మార్చమని తాను దేవుని ప్రార్థిస్తూ ఉంటానని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here