ప్రధాన మంత్రి పర్యటన విజయవంతం అయింది : కిషన్ రెడ్డి

0
79

ప్రధాన మంత్రి పర్యటన విజయవంతం అయిందని, ప్రజల్లో మంచి స్పందన వచ్చిందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రానికి అనేక రకమైన మేలు జరిగేలా అనేక ప్రాజెక్టులను అంకితం చేశారని, 11,500 కోట్ల ప్రాజెక్టులకు రైల్వే ,ఆరోగ్య, రహదారులు చేపట్టారని ఆయన తెలిపారు. ఉభయ రాష్టలకు మేలు జరిగేలా చేశారన్నారు కిషన్ రెడ్డి. రాజమండ్రి టు హైదరాబాద్ రోడ్డు 56 కిలో మీటర్లు తగ్గుతుందని, గతంలో హైదరాబాద్ టూ విశాఖపట్నం ట్రైన్ ప్రారంభించారన్నారు. 14 వందే భారత్ ట్రైన్ ప్రారంభించారు తెలుగు రాష్టాలకు ఉపయోగ పడుతుందని, ముఖ్యమంత్రి కార్యక్రమానికి రాలేదు..ఆయనకు ఇంతకన్నా వేరే పని ఏముందో కెసిఆర్ ప్రజలకు చెప్పాలన్నారు కిషన్‌ రెడ్డి. దేశంలో వంద వందే భారత్ ట్రైన్స్ ప్రారంభిస్తామని చెప్పారని, తలసాని అది తెలియకపోతే మేము ఏం చేయాలన్నారు. తెలంగాణ మంత్రులు అందరూ జీరోనే అని ఆయన ఎద్దేవా చేశారు.

 

 

కేసీఆర్ ఫౌమ్ హౌస్ నుంచి బయటకురారు…..ప్రజలను కలవరని, కేసీఆర్‌కి ఇంతకు మించిన పని ఏంటి..ఆయన ఎందుకు ప్రధాని సభకు రాలేదని కిషన్‌ రెడ్డి ప్రశ్నించారు. గతంలో ప్రధాన మంత్రి వస్తే రామగుండం రాలేదని, ఈరోజు 11,500 కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేస్తే కేసీఆర్‌ రాలేదని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ను ఎలా దోపిడీ చేయాలని కేసీఆర్‌ కుటుంబం చూస్తుందని, కొడుకును ముఖ్యమంత్రి చేయాలనే ఆలోచన తప్ప ఏమి లేదని కిషన్‌ రెడ్డి విమర్శించారు. మోడీ అనేక పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి వచ్చారు,ముఖ్యమంత్రి కనీస సంప్రదాయాలు పాటించడం లేదు. తెలంగాణ సమాజం దీన్ని అర్థం చేసుకోవాలి. తెలంగాణ అభివృద్ధి కార్యక్రమం లో ముఖ్యమంత్రి భాగస్వామ్యం కావాలి… కేసీఆర్‌ బాధ్యతారహితంగా వ్యవహరించారు. కేసీఆర్‌ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ప్రధాన మంత్రికి కేసీఆర్‌ తో వైర్యం లేదు.. తెలంగాణ ప్రజలతో కేసీఆర్‌కి వైర్యం ఉంది. మేము ప్రొటో కాల్ పాటించాము. చివరి నిమిషంలో సభలో కేసీఆర్‌కి ఏర్పాటు చేసిన కుర్చీ తీసేశాము. మీరు వస్తే ప్రభుత్వ సభాల ఉండేది’ అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here