కుటుంబ పాలన పోవాలంటే బీజేపీతోనే సాధ్యం : కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి

0
102

తెలంగాణ కాంగ్రెస్‌ను కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి వీడి వెళ్లడంతో ఆ పార్టీ నేతలు ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. నిన్న మునుగోడు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సభలో టీపీసీసీ రేవంత్‌ రెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలపై స్పందిస్తూ.. టీఆర్‌ఎస్ లోకి, కాంగ్రెస్ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలు వెళ్ళినపుడు ఎవరు మాట్లాడలేదు.. ఎవరూ ఒక్క మాట మాట్లాడలేదు.. జేపీ నడ్డా, కిషన్‌రెడ్డి, తరుణ్‌చుగ్‌లను కలిశా.. ఈ నెల 21న అధికారికంగా బీజేపీలో చేరుతున్నా.. మునుగోడులో జాయినింగ్‌ సభ ఉండే అవకాశం. పార్టీ మారాలనుకునే స్వేచ్ఛ నాకు ఉంది. ఒక పార్టీ గుర్తు మీద గెలిచి, వేరే పార్టీకి వెళ్ళటం లేదు. నైతికంగా ప్రజాస్వామ్య బద్దంగా పార్టీ మారుతున్న. కుటుంబ పాలన పోవాలంటే బీజేపీతోనే సాధ్యం.

తెలంగాణ ఉద్యమంలో లేని వాళ్ళు మమ్మల్ని అవమాన పరిచారు. మా పై పెట్టిన అధ్యక్షుని బ్రాండ్ ఎటువంటిదో తెలుసు. రేవంత్ ఏం త్యాగం చేసాడు తెలంగాణా కోసం. తెలంగాణ కోసం జైలుకు వెళ్లాడా, ఓటుకు నోటు కేసులో వెళ్లాడా. నీ చరిత్ర తెలిసి బాధపడుతున్నాం. నిన్న మునుగోడులో నాపై వాడిన భాష.. పీసీసీ చీఫ్ రేవంత్ భాష విన్న తర్వాత నేను బాధపడుతున్న.. సరిగ్గా మాట్లాడలేని వ్యక్తులు.. తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేసిన వెంకన్నపై.. అద్దంకి దయాకర్ మాట్లాడిన భాష ఏంటి.. కోమటి రెడ్డి బ్రదర్స్ పై మాట్లాడిన భాష తెలంగాణ ప్రజలు చూశారు.. అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here