వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే చిరుమర్తికి డిపాజిట్ కూడా రాదు : కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి

0
82

నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి పట్టణ కేంద్రంలో ఆర్.ఆర్.ఆర్ రెస్టారెంట్ ను బీజేపీ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బండి సంజయ్ సభ్యత్వం రద్దు చేయాలన్న ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఒక పార్టీలో గెలిసి ఇంకో పార్టీలోకి పోయిన 10మంది సభ్యత్వంను మొదట రద్దు చేయాలన్నారు. అంతేకాకుండా.. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే చిరుమర్తికి డిపాజిట్ కూడా రాదన్నారు రాజగోపాల్‌ రెడ్డి. చిరుమర్తి వెంట ఉన్న నాయకులే ఆయన ఒడిపోవాలని కోరుకుంటున్నారన్నారు.

 

2018లో నా వల్ల టికెట్ తెచ్చుకొని ఎమ్మెల్యేగా గెలిచి నాకు వ్యతిరేకంగా మునుగోడు ప్రచారం చేసిన ఎమ్మెల్యే చిరుమర్తి కి విశ్వసనీయత లేదన్నారు. వచ్చే ఎన్నికలలో నకిరేకల్ లో బీజేపీ అభ్యర్థి గెలవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నకిరేకల్, మునుగోడు నాకు రెండు కళ్లు అని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ కుటుంబం అధికారం అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు దాచుకున్నారని, వారు చేసిన పాపలే వారిని జైలు పాలు చేస్తాయని అన్నారు. బండి సంజయ్ అరెస్ట్ దుర్మార్గపు చర్య అని, సీఎం కేసీఆర్ కి తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్తారని ఆయన అన్నారు. బీఆర్ఎస్‌ నాయకులకు ఆత్మగౌరవం లేదన్న రాజగోపాల్‌ రెడ్డి.. సీఎం కేసీఆర్ కాళ్ళ కింద తాకట్టు పెట్టారు కొందరు బీఆర్ఎస్ నాయకులు అన్నారు. ఆత్మగౌరవం కోసమే తెలంగాణ తెచ్చుకున్నాం కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదని ఆయన వ్యాఖ్యానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here