సస్పెండ్ చేసినా.. సమస్యలను ప్రజా కోర్టులో ప్రస్తావిస్తూనే ఉంటా : కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

0
108

రాష్ట్ర శాసనసభ నుంచి తనను సస్పెండ్ చేసినా తాను సమస్యలను ప్రజా కోర్టులో ప్రస్తావిస్తూనే ఉంటానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు. అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ కు నిరసనగా కార్యాలయంలో మాక్ అసెంబ్లీని నిర్వహించారు. నెల్లూరు రూరల్ లో ప్రజా సమస్యల పరిష్కారానికి నాలుగేళ్ల నుంచి పోరాడుతున్నా ఫలితం లేదన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి ఇచ్చిన జీవోలకు దిక్కు లేకుండా పోయిందని ..ఆర్థిక శాఖ నుంచి అనుమతులు రాకపోవడంతో పనులన్నీ ఆగిపోయాయని అన్నారు.. సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తూనే ఉంటానని కోటంరెడ్డి స్పష్టం చేశారు. శాంతియుతంగా గాంధీగిరి తరహలో నిరసన తెలియజేస్తుంటే అడ్డుకున్నారని, అసెంబ్లీకి ప్లకార్డు పట్టుకెళ్తుంటే..పీకేశారని ఆయన ఆరోపించారు. ప్రజా సమస్యలు తెలియజేయడానికి నాకు మైక్ ఇవ్వలేదని, నన్ను తిట్టేందుకు 40 నిమిషాలు మంత్రులకు మైకు ఇచ్చారని ఆయన మండిపడ్డారు. నా పేపర్ సైతం దౌర్జన్యంగా లాక్కున్నారని, ఇదేంటని ప్రశ్నించిన నన్ను.. మార్షల్స్ తో బయటకు పంపి సస్పెండ్ చేశారన్నారు.

నేను మాట్లాడాలి అనుకున్నది మాక్ అసెంబ్లీ ద్వారా తెలియజేస్తానని, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని సమస్యలను మాక్ అసెంబ్లీ ద్వారా స్పీకర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఆర్జి ఇస్తే పరిష్కరిస్తామని ఆర్ధిక మంత్రి చెప్పడం హాస్యాస్పదమని ఆయన విమర్శించారు. నా దగ్గర ముఖ్యమంత్రి ఇంపార్టెంట్ అని 2021లో సంతకాలు పెట్టిన అర్జీలు ఉన్నాయని, రెండు సంవత్సరాలు గడుస్తున్నా ముఖ్యమంత్రి సంతకాలు పెట్టిన ఫైల్స్ కి దిక్కులేదని ఆయన అన్నారు. ఇప్పుడు అర్జీలు ఇస్తే ఆరు నెలల్లో ఏమి చేస్తారని ఆయన అన్నారు. నా మీద పరుష పదజాలం వాడిన 5 మంది మంత్రుల పై సమాధానాలు చెప్పాలని, ముఖ్యమంత్రి ఇచ్చిన జీవోకి.. టెండర్లు పిలిచినా.. నిధులకు అనుమతులు లేక పనులు ఆగిపోయాయన్నారు. ఓ శాసనసభ్యుడిగా ఇంతకంటే ఏం చేయాలో అర్థం కావడం లేదన్నారు. కాళ్లు నొప్పులతో నాలుగు గంటల పది నిమిషాలు అసెంబ్లీలో నిలుచున్నా మైక్ ఇవ్వలేదని, నా రూరల్ నియోజకవర్గ సమస్యల కోసం ఆర్జించా, రికివెస్ట్ చేసాను.. ఇక ఉద్యమం తప్పదన్నారు. రూరల్ సమస్యల పరిష్కారానికి శాసనసభ్యుడిగా నేను చేస్తున్న ప్రయత్నాన్ని గమనించాలన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here