ఐపీఎల్ లో దురదృష్టకరమైన జట్టుగా ఆర్సీబీ పేరు గాంచింది. కప్ అందుకోవడానికి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఆఖరి నిమిషంలో ఒత్తిడికి లోనవ్వడంతో టైటిల్ అందని ద్రాక్షలాగే మిగిలిపోతుంది. ప్రతీసారి ఈ సాలా కప్ నమ్ దే అంటూ బరిలోకి దిగే ఆర్సీబీ లీగ్ దశ వరకు బాగానే ఆడుతున్నా.. ప్లే ఆఫ్ రేసులో మాత్రం చతికిలపడుతూ వస్తోంది. గత మూడు సీజన్లుగా ఇదే తంతు నడుస్తుంది. మూడుసార్లెు ఐపీఎల్ లో రన్నరప్ గా నిలిచిన ఆర్సీబీ కనీసం ఈసారైన కప్ కొట్టాలని ఆర్సీబీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
బుధవారం కేకేఆర్, ఆర్సీబీ మ్యాచ్ కు హాజరైన ఒక చిన్నారి చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆర్సీబీ టైటిల్ కొట్టేవరకు నేను స్కూల్ లో జాయిన్ అవను అంటూ ప్లకార్డు ప్రదర్శించడం ఆసక్తి రేపింది. మ్యాచ్ జరుగుతుండగా ఆ చిన్నారి ప్లకార్డు పట్టుకొని అటు ఇటు తిరగడంతో కెమెరాలు అన్ని ఆ చిన్నారిని హైలెట్ చేశాయి.
ఇదంత ఒక వ్యక్త వీడియో తీసి ట్విట్టర్ లో షేర్ చేయగా చిన్నారి ట్రెండింగ్ లోకి వచ్చింది. ఇది చూసిన అభిమానులు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. వాళ్లు టైటిల్ కొట్టినా.. కొట్టకపోయినా.. డబ్బులు వస్తాయి.. నువ్వు చదువుకుంటేనే గౌరవం వస్తుంది. ఈ చిన్నారి కోరిక తీరాలని కోరుకుందాం.. ఆర్సీబీ కప్ గెలిస్తే ఓకే ఒకవేళ గెలవకపోతే పరిస్థితి ఏంటో మరి ఆలోచించుకో.. స్కూల్ ఎగ్గొట్టడానికి ఆర్సీబీ పేరుతో మాస్టర్ ప్లాన్ వేశావుగా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.