షూటింగ్ కు రెడీ అంటున్న మహేష్ బాబు

0
53

ఘట్టమనేని కుటుంబంలో వరుస మరణాలు ప్రిన్స్ మహేశ్ బాబును శోకసంద్రంలో ముంచాయి. తండ్రి.. టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ ఇటీవల మృతి చెందడంతో ఆయన కుమారుడు, మహేష్ బాబు తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయాడు. కృష్ణ గారికి సంబంధించిన ఆచార కార్యక్రమాలను మహేష్ పూర్తి చేశాడు. నలుగురితో ఉంటేనే మహేశ్ మామూలుగా ఉంటున్నాడు. ఒంటరిగా ఉంటే తండ్రి ఆలోచనలతో బాధపడుతున్నాడని సన్నిహితులు చెప్తున్నారు. అయితే మహేష్‌ కూడా ఇలాంటి పరిస్థితుల్లో షూటింగ్ కు వెళ్తేనే బెటర్ అనే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తోంది. ఇలాంటి ఆపత్కాలంలో దర్శకుడు త్రివిక్రమ్ తోడుగా నిలుస్తున్నాడు. ఆయన వెంటే ఉంటూ మహేష్‌కు ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఈ క్రమంలో ఇంట్లోనే ఉంటే మహేష్ మరింత దు:ఖంలోకి వెళ్తాడని, ఆయన్ని సినిమా షూటింగ్‌కు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు త్రివిక్రమ్. మహేష్ నెక్ట్స్ మూవీని త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాకు సంబంధించి సమయం దొరికినప్పుడల్లా మహేష్‌తో మాట్లాడుతున్నాడట. ఇలా మహేష్‌ను విషాదం నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం త్రివిక్రమ్ చేస్తున్నాడు. దీంతో త్రివిక్రమ్‌ను మహేష్ అభిమానులు అభినందిస్తున్నారట. అయితే, తాజాగా మహేష్‌ను తన నెక్ట్స్ మూవీ షూటింగ్‌లో పాల్గొనేలా త్రివిక్రమ్ ఆయన్ను రెడీ చేస్తున్నాడట. ఈ క్రమంలోనే సినిమా షూటింగ్ కు బాక్ టూ వర్క్ అంటూ మహేశ్ ట్వీట్ చేయడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన హీరోకు తామున్నామంటూ ధైర్యం చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here