బస్తాతో షోరూంకి వచ్చిన కస్టమర్.. కంగుతిన్న యజమాని

0
208

సంకల్పం ఉంటే ఏదైనా సాధించొచ్చు. ఓ యువకుడు స్కూటర్ కావాలని కొన్నాళ్లుగా కలలు కంటున్నాడు. అందుకని తన రోజువారీ ఖర్చుల నుండి ఆరు సంవత్సరాలుగా రూపాయి రూపాయి పొదుపు చేశాడు. చివరకు ఈ మొత్తం అతనికి స్కూటర్ కొనడానికి సరిపోతుందని భావించి.. షాపుకు చేరుకుని తన కలను నెరవేర్చుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే ఈ యువకుడు అస్సాంలోని దరంగ్ జిల్లాలోని సిపజార్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. అతని పేరు మహ్మద్ సైదుల్ హక్. దృఢ సంకల్పంతో ఉంటే ఎలాంటి కష్టాలనైనా అధిగమించి విజయం సాధించగలరనడానికి ఈ యువకుడు సరైన ఉదాహరణ. సైదుల్ హక్ గౌహతిలో ఒక చిన్న దుకాణాన్ని నడుపుతున్నాడు. కొన్నాళ్లుగా బైక్ సొంతం చేసుకోవాలనుకున్నాడు. అందుకోసం డబ్బు పొదుపు చేయడం ప్రారంభించాడు. ఎట్టకేలకు అతని కల నెరవేరింది.

గత ఆరేళ్లుగా డబ్బు ఆదా చేస్తున్నా
సైదుల్ హక్ చెప్పిన ప్రకారం.. ఎప్పుడో ద్విచక్ర వాహనం కొనుక్కోవాలని అనుకున్నాను. అందుకు నేను సంపాదించిన దాంట్లో ఖర్చులు పోను మిగతా చిల్లరను పొదుపు చేయడం మొదలు పెట్టాను.. అలా ఆరేళ్లు గడిచిపోయాయి. ప్రస్తుతం స్కూటర్ కొనాలన్న కల నెరవేరడానికి దగ్గరలో ఉన్నాను. ప్రస్తుతం దాదాపు నా దగ్గర బైకు కొనేందుకు సరిపడా డబ్బులున్నాయి. ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నాను అని తెలిపారు.

షోరూమ్ యజమాని చెప్పిన ప్రకారం
ఇలా చిల్లర నాణేలను సేకరించడం గొప్ప చర్య. కానీ పెద్ద సమస్య ఏమిటంటే ఇన్ని నాణేలను ఎవరు తీసుకుంటారు? షాప్ యాజమాన్యాలు ఇలా నాణేలను అంగీకరించరు. అయితే ఆ స్కూటర్‌ను కొనుగోలు చేసేందుకు ఓ వినియోగదారుడు తొంభై వేల రూపాయల నాణేలను తీసుకొచ్చాడు. విషయం తెలియడంతో ఆశ్చర్యంతో పాటు సంతోషం కూడా కలిగింది. స్కూటర్ కొనడానికి ఓ వ్యక్తి తొంభై వేల నాణేలతో వచ్చారని నా ఎగ్జిక్యూటివ్ చెప్పగా.. నేను అలా చూసినందుకు సంతోషించాను. అతడు భవిష్యత్తులో కారు కొనుక్కోవాలని కూడా నేను కోరుకుంటున్నాను

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here