చంద్రబాబు మీద మండిపడ్డ మంత్రి రమేష్

0
73

వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంది. రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి సవాల్ విసిరారు. చంద్రబాబు ట్విట్ కు సమాధానం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రంలోని ఒక కోటి 50 లక్షల ఇళ్ళకు రావటానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నాడో లేదో చెప్పాలి అన్నారు. జగనన్న కాలనీల నిర్మాణాలు ఎలా ఉన్నాయో చూడటానికి రావాలని ఛాలెంజ్ చేస్తున్నాను. నీ కొడుక్కి పనీ పాటా లేదు. రోడ్ల మీద తిరుగుతున్నాడు. 14 ఏళ్ళ పాటు ముఖ్యమంత్రిగా నీ పాలన, నాలుగేళ్ల పాలనలో జగన్ పాలన పై ఆలోచించాలి అన్నారు జోగి రమేష్.

ప్రజలకు అంత మంచి చేస్తే 2019 ఎన్నికల్లో 23 సీట్లకే ఎందుకు పరిమితం అయ్యే వాడివి? అన్నారు మంత్రి జోగి రమేష్. ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. పెడనలో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని మంత్రి జోగి రమేష్ ప్రారంభించారు.మా భవిష్యత్తు జగనన్నే అనేది ప్రజల ఆకాంక్ష అంటున్నారు మంత్రి జోగిరమేష్. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేనంత అభివృద్ధి కార్యక్రమాలను ఏపీలో సీఎం జగన్ చేస్తున్నారు. బటన్ నొక్కగానే రైతులు , అక్కచెల్లెమ్మల అకౌంట్లలలోకి డబ్బులు జమ అయ్యేలా కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ప్రతీ గడపకూ వెళ్లి ప్రభుత్వం పట్ల ఎంత సంతృప్తిగా ఉన్నారో అడిగి తెలుసుకుంటాం అన్నారు. విపక్షాల విమర్శలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.

చంద్రబాబు అయినా, లోకేష్ అయినా నా ఛాలెంజ్ ను స్వీకరించాలి.లోకేష్ పాదయాత్రకు వస్తా. ఏ జగనన్న కాలనీ అయినా.. ఓకే.. మీరు చెప్ఫినా ఓకే…నన్ను చెప్పమన్నా సరే. రాష్ట్రంలో కోటిన్నర గడపలకు వెళ్ళటానికి చంద్రబాబు, లోకేష్ సిద్ధమా?? 2024 ఎన్నికల్లో చంద్రబాబు కుప్పంలో కూలిపోతాడు. జనం మెచ్చిన నాయకుడు జగన్. వెన్నుపోటు నాయకుడు చంద్రబాబు. వచ్చే ఎన్నికల్లో 151 కంటే ఎక్కువ స్థానాలతో మళ్ళీ వైసీపీ గెలుస్తుంది ..175 స్థానాల్లో సైకిల్ గుర్తు పై అభ్యర్థులను పెట్టే ధైర్యమే చంద్రబాబుకు లేదు. సీపీఐ నారాయణ, పవన్ కళ్యాణ్ అందరూ అంటకాగుతున్న సన్నాసులు అంటూ మండిపడ్డారు జోగి రమేష్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here