లైవ్‌లో టీడీపీ మేనిఫెస్టో చించివేసి డస్ట్‌బిన్‌లో వేసిన మంత్రి..

0
181

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేనిఫెస్టోపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు, రాష్ట్ర మంత్రులు ఓ విమర్శలు గుప్పిస్తున్నారు.. తాజాగా ఈ వ్యవహారంపై మంత్రి జోగి రమేష్‌ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. డర్టీ బాబు, డస్ట్‌బిన్ మేనిఫెస్టో అంటూ చంద్రబాబు, టీడీపీ మేనిఫెస్టో పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ 2014 టీడీపీ మేనిఫెస్టోను చూయించారు.. అంతేకాదు.. ఆ మేనిఫెస్టోను చించి డస్ట్ బిన్ లో వేశారు జోగి రమేష్‌..

2014 టీడీపీ మేనిఫెస్టోపై, 2019లోని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోపై చర్చకు సిద్ధమా అంటూ చంద్రబాబు సవాల్‌ చేశారు జోగి రమేష్‌.. అయినా మీరు చర్చకు రాలేరులే.. అంత దమ్ము లేదు చంద్రబాబుకు, ఆయన తాబేదారులకు అంటూ ఎద్దేవా చేశారు.. 450కి పైగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు.. ఆ తర్వాత మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేశాడని ఆరోపించారు.. కానీ, ప్రభుత్వం 98 శాతం మేనిఫోస్టోలని హామీలను అమలు చేసిందని స్పష్టం చేశారు. ప్రతి గడపలో, ప్రతి ఊర్లో ప్రభుత్వ పథకాలు కనిపిస్తాయి.. ఏ రాష్ట్రంలో అయినా నాలుగేళ్లల్లో ఇన్ని పథకాలు అమలు చేశారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు ఒక నకిలీ, పిరికిపంద, పనికిమాలిన వాడు.. పార్టీని దొంగతనం చేశాడు.. పొత్తుల్లో పొర్లాడుతుంటాడు అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి జోగి రమేష్.

2024 ఎన్నికల్లో చంద్రబాబు అడ్రస్ గల్లంతు అవుతుంది అన్నారు జోగి రమేష్.. రైతు రుణాలు మాఫీ చేస్తానని అధికారంలోకి వచ్చి రైతులను మోసం చేశాడు. ఇప్పుడు మళ్ళీ ఏటా 20 వేలు ఇస్తానంటున్నాడు.. బీసీలకు రక్షణ కవచం అట.. బీసీలను భక్షించిందే నువ్వు కదా? బీసీ వర్గాలను తొక్కి నార తీశాడు అని విమర్శించారు. బీసీల ఆత్మగౌరవం వైఎస్ జగన్.. పేదలకు ఇళ్ళ స్థలాలు ఇస్తామంటే అడ్డుకున్న వ్యక్తి చంద్రబాబు అని ఫైర్ అయ్యారు.. ఇప్పుడు పేదలను ధనవంతులను చేస్తానని అంటున్నాడు అంటూ చంద్రబాబుపై మండిపడ్డారు మంత్రి జోగి రమేష్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here