కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం

0
953

కేంద్ర ఆర్థిక విధానాలను మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. నరేంద్ర మోడీ అస్తవ్యస్త, అనాలోచిత నిర్ణయాల వల్లనే దేశ ప్రజలకు కష్టాలు.  తమ తప్పుడు ఆర్థిక విధానాలను కప్పిపుచ్చుకునేందుకు కేంద్రం అనేక అబద్ధాలు చేప్తొంది. దేశ చరిత్రలోనే అత్యంత దారుణమైన అర్ధిక నిర్ణయాలు తీసుకున్న దరిద్రపు ప్రభుత్వంగా మోడీ ప్రభుత్వంలో చరిత్రలో నిలుస్తుంది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా రూపాయి బలహీనపడడం, 30 సంవత్సరాల్లోనే అత్యధిక ద్రవ్యోల్భనం. 45 సంవత్సరాల అత్యధికం నిరుద్యోగం, నైజీరియా లాంటి దేశాల కన్నా తక్కువ స్ధాయికి పేదరిక ప్రమాణాల్లో భారత్ వెనకబడి ఉండడం వంటి అనేక దుష్పరిణామాలే ఇందుకు ఉదాహరణలు. పసిపిల్లలు వాడుకునే పెన్సిల్లు నుంచి మొదలుకొని హాస్పిటల్ బెడ్ల వరకు చివరికి అంత్యక్రియల వరకు అన్నింటిపై పన్ను వేస్తూ ప్రజలను దోచుకుంటున్న ప్రభుత్వం నరేంద్ర మోడీది.

దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి దూరదృష్టి లేకపోవడం, రానున్న సవాళ్లను అంచనా వేయలేకపోవడం, అనాలోచిత నిర్ణయాలు, తమ మిత్రులైన భారీ కార్పొరేట్ కంపెనీలకు ప్రయోజనాలు చేకూర్చే క్రోనీ క్యాపిటలిజం ఇవే  మోడి ప్రభుత్వ  అసలైన ఆర్థిక విధానాలు. కేంద్రం విభజించు పాలించు విధానంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంది. మోడీ వైఫల్యాలను ఎండగడితే కేంద్ర సంస్థలతో కట్టడి చేసే ప్రయత్నం చేస్తుంది. తమ అబద్ధపు మాటలతో, మంద బలంతో పార్లమెంటులో బయటపడినా, దేశ ప్రజల ముందు మోడీ దోషిగా నిలబడాల్సిందే. లేని గొప్పలు మాని ద్రవ్యోల్భనాన్ని కట్టడి చేసి, ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టాలని కేంద్రానికి కేటీఆర్ హితవు పలికారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here