కొత్త ఇంటిగ్రేటెడ్ సెక్రటేరియట్ కాంప్లెక్స్‌కు భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గురువారం నిర్ణయం తీసుకుని తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దసరా నాటికి సమీకృత సచివాలయ సముదాయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే దీనిపై తాజాగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందిస్తూ.. తెలంగాణ సెక్రటేరియట్‌కు అంబేద్కర్ పేరు పెట్టాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయం హర్షణీయమన్నారు.
అంతేకాకుండా.. పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని తెలంగాణ అసెంబ్లీ ఇప్పటికే తీర్మానం చేసిందని ఆయన వెల్లడించారు. ఢిల్లీలోని కొత్త పార్లమెంటు భవనానికి కూడా అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నామన్నారు మంత్రి తలసాని. పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం కాదు… ఆచరణలో పెట్టి చూపాలని బీజేపీ నేతలను డిమాండ్ చేస్తున్నామన్నారు.