టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి జగన్ పాలనపై నిప్పులు చెరిగారు. సంక్రాంతి సంబరాల పేరుతో జగన్ రాష్ట్రానికి విష సంస్కృతి తీసుకొచ్చాడు.సంస్కృతి సంప్రదాయాలకు నెలవైన రాష్ట్రాన్ని జగన్ జూదశాలగా మార్చాడు. జూదాలు, కోడిపందేలు, గుండాట ముసుగులో వైసీపీ నేతలు రూ. 300 కోట్లు దోచుకున్నారు.జీవోనెం-01, సెక్షన్ 30 అమల్లో ఉంటే, సంక్రాంతి సంబరాల్లో దోపిడీ ఎలా జరిగిందో డీజీపీ చెప్పాలి.గన్నవరంలో తెల్లారే వరకు నగ్ననృత్యాలు జరిగినా పోలీసులకు కనిపించలేదా?
గోవా నుంచి ప్రవీణ్ చికోటి వచ్చి గుడివాడలో కేసినో పెడితే పోలీసులేం చేస్తున్నారు..?టీడీపీ ప్రభుత్వం ముగ్గుల పోటీలు, సాంస్కృతిక ప్రదర్శనలు, ఎడ్లపోటీలు నిర్వహిస్తే, జగన్ జూదాలు, నగ్న నృత్యాలు, గుండాట, కోడిపందేలు నిర్వహించాడు.సంబరాల రాంబాబు లాటరీ పేరుతో దోచేస్తుంటే, సీఎంకు తెలియదా? ప్రజలు నాశనమైనా, సంస్కృతి సంప్రదాయాలు మంట గలిసినా పర్లేదు..నీ జేబు నిండితే చాలా జగన్..? రాష్ట్రంలో టూరిజం లేదు. ఎటుచూసినా పేకాట.. గుండాట.. కేసినోలే అన్నారు గోరంట్ల. గతంలో ఎన్నడూ లేనివిధంగా సంక్రాంతి శోభ కనుమరుగు అయిందని, విలాసాల పేరుతో కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. కోడి కత్తి వల్ల అనేకమంది గాయాల పాలయ్యారన్నారు.