ఎమ్మెల్యేల ఎర కేసు.. విచారాణ 9కి వాయిదా

0
460

మొయినాబాద్‌ ఫాంహౌస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ కేసులో తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ బంధువైన శ్రీనివాస్‌కు సిట్‌ నోటీసులు ఇచ్చింది. ఈ మేరకు నేడు హైకోర్టులో ఈ కేసుపై విచారణ జరిగింది. అయితే.. కుట్రపూరితంగా శ్రీనివాస్ ను ఇరికించారని హైకోర్టులో శ్రీనివాస్‌ తరుపు న్యాయవాది ఉదయ్ హుల్లా వివరించారు. కేసుతో సంబంధం లేనప్పటికీ విచారణకు పిలిచినా సహకరించారన్నారు. అయితే.. సిట్ విచారణ ఎలా జరిగిందని జస్టిస్ ప్రశ్నించగా.. బండి సంజయ్ పేరు చెప్పాలని సిట్ అధికారులు ఒత్తిడి చేశారన్నారు. కేవలం ఒక్క ఫోటో వీరికి లభించినందుకు A7 గా చేర్చడం హాస్యాస్పదమని ఆయన అన్నారు. కుటుంబ సభ్యులను సిట్ అధికారులు వేధించారని ఆయన ఆరోపించారు. కేసులో అంతా మీడియా ట్రైల్ నడుస్తుందని, సిట్ వేశామని సుప్రీం కోర్టుకు చెప్పారు కానీ సిట్ లో ఉన్నది హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అని ఆయన అన్నారు. ఈ దర్యాప్తు కేవలం మీడియా హైప్ కోసమేనని, మెజిస్ట్రేట్ ముందు ఎఫ్ఐఆర్ చేరక ముందే పోలీసులు మీడియా బ్రీఫ్ చేశారన్నారు.

దర్యాప్తు మొత్తం కేవలం మీడియా కోసమే చేస్తున్నారన్నారు. ఈ కేస్ లో పీసీ యాక్ట్ సెక్షన్8 వర్తిస్తుందా అని హై కోర్టు ప్రశ్నించగా.. అసలు డబ్బు దొరకనప్పుడు సెక్షన్ 8 ఎలా వర్తిస్తుందని న్యాయవాది ఉదయ్ అన్నారు. కేవలం పొలిటికల్ గేమ్ కోసమే ఈ కేస్ పెట్టారని, అందుకే ఈ కేసును స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయాలని కోరుతున్నానన్నారు. సిట్ దాఖలు చేసిన మొదటి రిపోర్టు లీక్ పై కోర్టులో ఆసక్తికర వాదనలు సాగాయి. తమకు ఇవ్వకుండా సిట్ రిపోర్ట్ చేరడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు పిటీషనర్ తరపున న్యాయవాదులు. సిట్ రిపోర్ట్ ను కోర్టులో ఇచ్చిన తర్వాతే పిటిషన్ లోని వాద ప్రతివాదులకు ఇచ్చమని సిట్ న్యాయవాది అన్నారు.. రోహిత్ రెడ్డి సిట్ రిపోర్ట్ ను సీఎంకు చేర్చి ఉండచ్చు అని, సిట్ రిపోర్ట్ మీడియా కు లీకేజీ పై సిట్ ప్రెస్ నోట్ ఇచిందని అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామ్ చందర్ రావు వెల్లడించారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణ శుక్రవారంకు వాయిదా వేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here