లోకేష్ పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. ఇదిలా ఉంటే.. ఎమ్మెల్సీ తలశిల రఘురాం లోకేష్ పాదయాత్రపై హాట్ కామెంట్స్ చేశారు. లోకేష్ పాదయాత్ర ఒక అనామక పాదయాత్ర అని విమర్శించారు. పనికిమాలిన యాత్రలతో అబద్ధాలు చెప్పబోతున్నారు. అప్పట్లో వైసీపీకి సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం పాదయాత్ర చెయ్యాలని చెప్పారు. లోకేష్ పాదయాత్రకు
ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.
జగన్ పాదయాత్ర సమయంలో కూడా ముందు కడప జిల్లా వరకే అనుమతులు ఇచ్చారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారమే యాత్రలు చేయాలి. 2019 నుండి మా ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పనులను ప్రజలు వివరిస్తాం.వాటికి టీడీపీ నేతలు సమాధానం చెప్పాలి. లోకేష్, పవన్ కళ్యాణ్ తోపాటు ఇంకెవరైనా ఉంటే వారితో కూడా పాదయాత్ర చేయించుకోవచ్చు. అనామకుడు చేసే యాత్రలకు హైప్ క్రియేట్ చేయాల్సిన పనిలేదన్నారు. కన్నా లక్ష్మీనారాయణ ఎవరితో అయినా తాను పార్టీ మారుతున్నాను అని చెప్పారా??బీజేపీ నుంచి ఎవరూ జనసేనలోకి వెళ్ళరు.
జనసేన నుంచి బీజేపీలోకి ఎవరూ రారు. జీవో 1 రావటానికి టీడీపీ దుర్మార్గమైన వైఖరి కారణం. కందుకూరు, గుంటూరు సభల్లో తొక్కిసలాట వెనుక కుట్ర ఉందని చెబుతున్న టీడీపీ ఎందుకు కేసు పెట్టలేదు?? అని తలశిల రఘురాం ప్రశ్నించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఎందుకు విచారణ కోరరు ??ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజల ప్రాణాలకు విలువ ఇవ్వాలి. బీజేపీ పవన్ కళ్యాణ్ ను ఎందుకు వదులుకుంటుంది? 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకునే వాళ్ళు ఎందుకు పోరాడలేరు?? వారసత్వ రాజకీయాలు కాదు జవసత్వ రాజకీయాలు చేయాలి. పాదయాత్ర చేసే హక్కు లోకేష్ కు ఉంది.