హోటల్ గదిలో ఉరేసుకుని మోడల్‌ సూసైడ్.. సంతోషంగా లేనంటూ..

0
137

ముంబైలో అంధేరీ ప్రాంతంలోని ఓ హోటల్‌ గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఓ మోడల్ ఆత్మహత్యకు పాల్పడింది. 40 ఏళ్ల మోడల్ మృతదేహం గురువారం లభ్యమైనట్లు పోలీసులు వెల్లడించారు. ఆ మోడల్ బుధవారం రాత్రి 8 గంటల సమయంలో హోటల్‌లో డిన్నర్‌ కూడా ఆర్డర్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. గురువారం హౌస్ కీపింగ్ సిబ్బంది పలుమార్లు ఫోన్ చేసినా ఆమె తలుపు తీయలేదు. దీంతో హోటల్ మేనేజర్ పోలీసులకు సమాచారం అందించారు.

ఓల్డ్‌ సిటీలో అట్లుంటది మరి.. బిర్యానీ విషయంలో అర్ధరాత్రి హోంమంత్రికి ఫోన్‌..

హోటల్‌కు చేరుకున్న పోలీసులు మాస్టర్‌ కీతో గదిని తెరిచి చూడగా మోడల్‌ మృతదేహం ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. ఘటనా స్థలం నుంచి సూసైడ్ నోట్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. “నన్ను క్షమించండి. దీనికి ఎవరూ బాధ్యులు కాదు. నేను సంతోషంగా లేను. నాకు శాంతి కావాలి.” అని సూసైడ్‌ నోట్‌లో రాసి ఉంది. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here