ఇలాంటి తల్లిని ఎక్కడైనా చూశారా?

0
106

నవమాసాలు మోసి, పిల్లల్ని కనే తల్లి వారిని ఎంత కష్టమయినా పెంచి ప్రయోజకుల్ని చేస్తుంది. అలాంటి తల్లి తన కూతుర్ని నాలుగు అంతస్థుల పై నుంచి నిర్దాక్షిణ్యంగా కిందకి పడేయడం కలకలం రేపుతోంది. బిడ్డకు చిన్న దెబ్బతగిలితేనే అల్లాడిపోతుంది తల్లి. కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. కానీ, ఓ తల్లి దారుణానికి ఒడిగట్టింది. సభ్య సమాజం తలదించుకునే పనిచేసింది. నాలుగేళ్ల కుమార్తెను నాలుగో అంతస్తు నుంచి కింద పడేసి హత్య చేసింది. బెంగళూరులో జరిగిన ఈ అమానుష సంఘటన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. పాపతో కలిసి అపార్ట్‌ మెంట్ బయట బాల్కనీలో తచ్చాడింది. మళ్ళీ లోపలికి వెళ్ళంది. పాపను రెయిలింగ్ మీద కూర్చోబెట్టింది. కానీ పిల్లను కిందకు తోచేయలేదు.మళ్ళీ ఇంట్లోకి పాపను తీసుకెళ్ళి… బయటకు తెచ్చింది. ఈసారి రెయిలింగ్ నుంచి పాపను అమాంతంగా కిందకు పడేసింది.

పాపను కింద పడేసిన తర్వాత ఆమె సైతం కింద దూకేందుకు బాల్కనీ రెయిలింగ్‌ ఎక్కి కాసేపు నిలబడింది. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు పరుగు పరుగున వచ్చి ఆమెను వెనక్కి లాగారు. అక్కడికి వచ్చి కింద దృశ్యం చూసి వారంతా షాకయ్యారు. నాలుగో అంతస్తు నుంచి కింద పడిన పాప అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. ఉత్తర బెంగళూరు ఎస్‌ఆర్‌ నగర్‌లోని అపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన జరిగింది. నాలుగేళ్ల చిన్నారి మాట్లాడలేదని, చెవులు సైతం వినబడవని తెలిపారు. దాంతో ఆ మహిళ మానసిక ఒత్తిడికి లోనైనట్లు చెప్పారు. భర్త ఇచ్చిన ఫిర్యాదుతో నిందితురాలిని అరెస్ట్‌ చేసినట్లు వెల్లడించారు. ఆమె ఒక డెంటిస్ట్‌ కాగా.. భర్త సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కూడా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here